Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిశ్చితార్థం రద్దయిందనీ... యువతిని చంపేసిన యువకుడు .. ఎక్కడ?

murder
, మంగళవారం, 11 జులై 2023 (09:40 IST)
హర్యానా రాష్ట్రంలో ఓ దారుణ ఘటన జరిగింది. తనతో జరిగిన నిశ్చితార్థం రద్దు కావడంతో జీర్ణించుకోలేని ఓ యువకుడు.. ఆ యువతిని నిర్దాక్షిణ్యంగా చంచేశాడు. అందరూ చూస్తుండగానే ఆ యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి (19)కి నాలుగు నెలల క్రితం రాజ్‌కుమార్ (23) అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఈ నిశ్చితార్థం రద్దు అయింది. దీన్ని రాజ్‌కుమార్ జీర్ణించుకోలేక పోయాడు. దీన్ని మనసులో పెట్టుకున్న ఆ యువకుడు... యువతిని హత్య చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు.
 
ఇంతలో నిశ్చితార్థం జరిగిన యువతి తన తల్లితో కలిసి సోమవారం గురుగ్రామ్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతుండగా రాజ్‌కుమార్ ఆమెతో మాటకలిపాడు. అంతలోనే తన వద్ద ఉన్న కత్తితో ఆ యువతిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 
 
సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు...  
 
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు ఒకటి నాగార్జున సాగర్ కుడి కాలువలో బోల్తాపడింది. ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో సాగర్ కెనాల్‌లో పెళ్లి బృందం బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృత్యువాతపడగా, మరో 12 మంది గాయపడ్డారు. ఈ బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 35 నుంచి 40 మంది వరకు ఉన్నట్టు సమాచారం. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాకినాడలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఈ పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్ అజీజ్ (65), అబ్దుల్ హానీ (60), షేక్ రమీజ్ (48), ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీబేగం (65), షేక్ షబీనా (35), షేక్ హీనా (6)లుగా గుర్తించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాప్ నిర్వాహకుల వేధింపులకు ఇంజనీరింగ్ విద్యార్థి మృతి