Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జ్యూస్ జాకింగ్ స్కామ్ : బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ చార్జింగ్ వాడొద్దు...

public mobile charger

ఠాగూర్

, ఆదివారం, 31 మార్చి 2024 (11:38 IST)
బహిరంగ ప్రదేశాలైన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల్లో ఉండే మొబైల్ చార్జింగ్ పాయింట్లను విలైనంత వరకు వినియోగించవద్దని కేంద్రం హెచ్చరించింది. ఈ పోర్టుల ద్వారా సైబర్ క్రిమినల్స్ ఫోన్లలోకి మాల్వేర్ చొప్పించి, డేటా తస్కరణ చేసే అవకాశం ఉందని దేశంలోని మొబైల్ వినియోగదారులను హెచ్చరించింది. పేర్కొంది. ఈ తరహా జ్యూస్ జాకింగ్ స్కామ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
 
చార్జింగ్ పాయింట్లకు అనుసంధానమైన ఫోన్లలో మాల్వేర్, ఇతర ప్రమాదకర సాఫ్ట్‌వేర్లను యూజర్‌కు తెలీకుండా ఇన్‌స్టాల్ చేసి, డేటా దొంగిలించడమే జ్యూస్ జాకింగ్. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల అవగాహనా రాహిత్యాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని కేంద్రం పేర్కొంది. బహిరంగ చార్జింగ్ పోర్టులను వాడేవారికి డేటా తస్కరణ రిస్కుతో పాటూ నిందితులు ఈ సమాచారంతో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కకుండా ఉండేందుకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కొన్ని కీలక సూచనలు చేసింది.
 
చార్జింగ్ పాయింట్లకు బదులు సాధారణ విద్యుత్ పాయింట్ల ద్వారా చార్జింగ్ చేసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో వాడుకునేందుకు నిత్యం పవర్ బ్యాంక్, లేదా ఇతర చార్జింగ్ సాధనాలును సిద్ధం చేసుకోవాలని సూచించింది. డివైస్‌ను ఎప్పుడూ లాక్ చేసి పెట్టుకోవాలి. స్మార్ట్ ఫోన్‌ను పిన్ లేదా ఇతర విధానాల్లో తెరిచేలా ఏర్పాటు చేసుకోవాలి. పెద్దగా పరిచయం లేని చోట్ల ఉన్న చార్జింగ్ పాయింట్లను వాడకపోవడమే మంచిది. వీలైనంత వరకూ స్మార్ట్ ఫోన్‌ను ఆఫ్ చేశాకే చార్జింగ్ చేయాలి. సైబర్ దాడులు జరిగిన సందర్భాల్లో 1930 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలి. ప్రభుత్వ వెబ్‌సైట్ www.cybercrime.gov.in ను సందర్శించి కూడా వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్ను మర్చిపోండి.. క్షమించండి... నా అధ్యాయం ముగిసిపోయింది... అమ్మానాన్నలకు విశాఖ బాలిక మెసేజ్!!