Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష

మహిళలపై పెచ్చరిల్లుతున్న అరాచకాలకు మధ్యప్రదేశ్ సర్కారు సీరియస్‌గా తీసుకోనుంది. మధ్యప్రదేశ్‌లో అత్యాచారాలు, వేధింపుల కేసులు మ‌రింత పెరిగిపోయాయి. ఎన్‌సీఆర్‌బీ రికార్డుల ప్రకారం దేశంలో అత్యాచారాలు జరుగుత

12ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష
, సోమవారం, 27 నవంబరు 2017 (10:33 IST)
మహిళలపై పెచ్చరిల్లుతున్న అరాచకాలకు మధ్యప్రదేశ్ సర్కారు సీరియస్‌గా తీసుకోనుంది. మధ్యప్రదేశ్‌లో అత్యాచారాలు, వేధింపుల కేసులు మ‌రింత పెరిగిపోయాయి. ఎన్‌సీఆర్‌బీ రికార్డుల ప్రకారం దేశంలో అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. దీంతో అత్యాచార నేరాల‌కు ఆ రాష్ట్ర శిక్షా స్మృతిని సవరించనున్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకున్నా.. మహిళలపై వయోబేధం లేకుండా అఘాయిత్యాలు జరుగుతున్న వేళ మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌ర్కారు ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
 
12 ఏళ్ల లోపు బాలిక‌ల‌పై అత్యాచారం చేసే కామాంధులకు ఉరిశిక్ష విధించాలని మధ్యప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణ‌యించి, ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి త్వరలో చట్టం తీసుకురానున్నట్లు తెలిపింది. మహిళలపై అత్యాచారయత్నం చేసినా, వెంటపడి వేధించినా రూ.లక్ష జరిమానా విధించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఈ శీతాకాల సమావేశాల్లో శాసనసభలో బిల్లు ప్రతిపాదిస్తామని ఆర్థిక మంత్రి జయంత్‌ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమల్ హాసన్ అభిమానిపై చేజేసుకున్నాడా? (వీడియో)