Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫోన్ చోరీ చేశాడనీ శరీరంపై పంచదార పోసి చీమలతో కుట్టించారు.. ఎక్కడ?

చిన్నపిల్లలు తెలిసోతెలియక చిన్నపాటి తప్పులు చేస్తే పెద్దవారు విచక్షణారహితంగా దండిస్తున్నారు. తాజాగా బీహార్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఈ రాష్ట్రంలోని ఈసాపూర్‌ గ్రామానికి చెందిన ఓ బాలుడు మొబైల్ చోరీచ

ఫోన్ చోరీ చేశాడనీ శరీరంపై పంచదార పోసి చీమలతో కుట్టించారు.. ఎక్కడ?
, సోమవారం, 24 సెప్టెంబరు 2018 (13:24 IST)
చిన్నపిల్లలు తెలిసోతెలియక చిన్నపాటి తప్పులు చేస్తే పెద్దవారు విచక్షణారహితంగా దండిస్తున్నారు. తాజాగా బీహార్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఈ రాష్ట్రంలోని ఈసాపూర్‌ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలుడు మొబైల్ చోరీచేశాడని నిందలువేశారు. ఆ బాలుడు తాను చోరీ చేయలేదని కుయ్యోమొర్రో అంటున్నా వినలేదు.
 
చివరకు ఆ బాలుడుని పట్టుకుని ఓ చెట్టుకు కట్టేశారు. దీంతో అక్కడ జనం గుమికూడారు. ఆ తర్వాత ఆ బాలుడి దుస్తులు ఊడదీసి, చెట్టుకు కట్టి, చావబాదారు. అంతటితో ఆగక ఆ పిల్లాడి శరీరంపై పంచదార పోసి, చీమలచేత కుట్టించారు. చుట్టుపక్కల చేరిన జనమంతా దీనిని వినోదంగా చూస్తూ ఆ బాధిత బాలునికి ఫొటోలు తీశారు. 
 
ఈ ఘటనపై ఆలస్యంగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు ఘటనాస్థలానికి చేరుకుని ఆ బాలుడి కట్లు విప్పదీసి ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నగ్నంగా వివాహం చేసుకున్నారు.. వాళ్లిద్దరూ ప్రకృతి ప్రేమికులట...?