Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదేం గోల.. ట్యూటర్‌కి గత జన్మ గుర్తుకొచ్చిందా..? యువతిని భర్త అంటుందే?

గత జన్మలో నువ్వే నా భర్తవి అంటూ విద్యార్థినిని ఓ మహిళా ట్యూటర్ వేధించిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన వెరోనికా బరోడే అనే వివాహిత ఓ ఇనిస్టిట్యూట్‌లో ట్యూటర్‌గా పనిచేస్

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (14:30 IST)
గత జన్మలో నువ్వే నా భర్తవి అంటూ విద్యార్థినిని ఓ మహిళా ట్యూటర్ వేధించిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన వెరోనికా బరోడే అనే  వివాహిత ఓ ఇనిస్టిట్యూట్‌లో ట్యూటర్‌గా పనిచేస్తోంది. ముంబైలోని టాటా మెమోరియల్ ఆస్పత్రికి వెళ్లిన సమయంలో ఆమెకు ఇండోర్‌కు చెందిన ఓ బీటెక్ విద్యార్థినిని ఎక్కడో చూసినట్లుగా అనిపించి ఆ అమ్మాయితో మాట కలిపింది. 
 
అలా వారి మధ్య పరిచయం ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకునే వరకు వెళ్లింది. తన తల్లి క్యాన్సర్ రోగి కావడంతో సదరు యువతి ముంబైలోనే కొద్దిరోజులు ఉంది. దీంతో వెరోనికా ఆమెకు ప్రతిరోజూ ఫోన్ చేయడం మొదలు పెట్టింది. యువతి తల్లి గురించి ఆరా తీస్తూ.. ఆమెతో స్నేహం పెంచుకుంది.
 
అయితే కొద్దిరోజుల నుంచి గత జన్మలో నువ్వే నా భర్తవి అంటూ.. ఈ జన్మలో కూడా నా భర్తగా నువ్వే వుండాలని.. మనం పెళ్లి చేసుకుని బంధాన్ని కొనసాగిద్దాం అంటూ అంటూ వేధించసాగింది. వెరోనికా వేధింపులకు విసిగిపోయిన విద్యార్థిని ఆమె ఫోన్ ఎత్తడం మానేసింది.. దీంతో ఉన్మాదిగా మారిపోయిన వెరోనికా.. ఇండోర్ వెళ్లి యువతి చదువుకునే కళాశాలకు వెళ్లి ఆరా తీసింది. విద్యార్థినిని కిడ్నాప్ చేయాలనుకుంది. 
 
ఇందుకోసం ఓ పోలీస్ కానిస్టేబుల్ సాయం తీసుకుంది. ఈ నేపథ్యంలో యువతి ఫ్లాట్‌కు వెళ్లిన వెరోనికా ఆమెను అపహరించేందుకు ప్రయత్నించింది. ఈ పరిణామానికి నివ్వెరపోయిన విద్యార్థిని వెంటే సేఫ్టీ అలారమ్ మోగించడంతో అపార్ట్‌మెంట్లో ఉంటున్న స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. 
 
వెరోనికాను, ఆమెకు సాయం చేసేందుకు వచ్చిన కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వెరోనికా చెప్పిన కారణం విని పోలీసుల విస్తుపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

ఫైటర్ రాజా టీజర్ ఇంపాక్ట్ ఫుల్ గా వుంది : విశ్వక్ సేన్

అల్లు అర్జున్ 21 సంవత్సరాల జర్నీ, దుబాయ్‌లో తన మైనపు విగ్రహం

ఔను.... ఆమె ఎస్ చెప్పింది.. ఎంగేజ్డ్: హీరో సిద్ధార్థ్

లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చదు, నటనకు ప్రాధాన్యం ఇస్తా : ఆయుషి పటేల్

సమ్మర్ వెకేషన్ కోసం యూరప్ వెళ్లనున్న చిరంజీవి

వేసవిలో కీరదోస తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అవకాడో పండుతో 6 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

యవ్వనంగా ఎక్కువకాలం జీవించేలా చేసే ఆహారం, అలవాట్లు ఏమిటి?

సన్‌ఫ్లవర్ ఆయిల్ టాప్ 8 ఆరోగ్య ప్రయోజనాలు

వేసవిలో మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా వుంచే 8 పండ్లు ఇవే, తినండి

తర్వాతి కథనం
Show comments