Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20 యేళ్లుగా వాళ్ల అవమానాలను భరిస్తున్నా : ప్రధాని మోడీతో ధన్‌ఖడ్

Dhankhar - Modi
, బుధవారం, 20 డిశెంబరు 2023 (13:45 IST)
గత 20 యేళ్ళుగా వాళ్ళ అవమానాలను తాను భరిస్తున్నానంటూ ప్రధాని నరేంద్ర మోడీతో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ చెప్పుకొచ్చారు. రాజ్యసభ ఛైర్మన్‌ను పార్లమెంట్‌లో అవమానించడం దురదృష్టకరమని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోను చేసి మాట్లాడారు. ఆ తర్వాత తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు ఉపరాష్ట్రపతి ట్విట్టర్‌లో వెల్లడించారు. 
 
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను అనుకరిస్తూ టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ చేసిన మిమిక్రీ తీవ్ర దుమారం రేపింది. దీనిని బీజేపీ ఎంపీలతో పాటు ఇతర నేతలు కూడా తప్పుబట్టారు. సస్పెండ్ అయిన ఎంపీల ప్రవర్తన సరిగా లేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. దీనికి రాహుల్ గాంధీ సహా ఇతర నేతలు వంతపాడడంపై విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై ఉపరాష్ట్రపతి ధన్‌ఖఢ్ ట్విట్టర్‌లో స్పందించారు.
 
ఎంపీల ప్రవర్తన ఆమోదయోగ్యంగా లేదని, చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తిని అనుకరిస్తూ హేళన చేయడం సిగ్గుచేటని ధన్‌విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ తనకు ఫోన్ చేసి మాట్లాడారని వెల్లడించారు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో చేసిన దారుణ చర్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ప్రతిపక్ష నేతల అవహేళనలకు తాను కూడా 20 ఏళ్లుగా గురవుతున్నట్లు మోడీ చెప్పారన్నారు. అయితే, ఉపరాష్ట్రపతికి పార్లమెంట్ ఆవరణలో ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ రాష్ట్ర అప్పు రూ.6,71,757 అప్పు : భట్టి విక్రమార్క