Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాలీవుడ్ హీరో ప్రభాస్‍‌కు అరుదైన అవకాశం... రామమందిరి ప్రతిష్టాపనకు ఆహ్వనం

Aadipurush poster
, మంగళవారం, 26 డిశెంబరు 2023 (07:28 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అగ్రహీరో ప్రభాస్‌కు అరుదైన అవకాశం లభించింది. జనవరి 22వ తేదీన అయోధ్యలో నిర్వహించే రామ మందిర ప్రతిష్టాపన వేడుకకు ఆయనకు ఆహ్వానం అందింది. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులకు కూడా పిలుపు వచ్చింది. ముఖ్యంగా, ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ హీరోలు రణ్‌బీర్ కపూర్ - అలియా భట్ దంపతులు, అజయ్ దేవగణ్, సన్నీ డియోల్, డైగర్ ష్రాఫ్, ఆయుష్మాన్ ఖురానా వంటికూడా అతిథుల జాబితాలో ఉన్నట్టు సమాచారం. అలాగే, కన్నడ స్టార్ హీరో యశ్‌కు కూడా ఈ ఆహ్వానం అందింది. "ఆదిపురుష్" చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మలయాళ స్టార్ మోహన్ లాల్, సంజయ్ లీలా బన్సాలీ, మాధూరీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, ధనుశ్, రిషబ్ శెట్టి తదితరులకు కూడా ఈ ప్రాణప్రతిష్ట వేడుకల్లో పాల్గొనాలని ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. 
 
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి - ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం (డిసెంబరు 26)న ఢిల్లీకి వెళుతున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు చేరుకుంటారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆయన తొలుత ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణాకు సంబంధించి అనేక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 
 
సాధారణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వెళ్లి ప్రధాన మంత్రిని కలవడమన్నది సంప్రదాయం. దీన్ని రేవంత్‌ కూడా కొనసాగించనున్నారు. వాస్తవానికి రాజకీయ వైరుధ్యాలతో సంబంధం లేకుండా.. కేంద్ర ప్రభుత్వంతో పాలనా పరమైన సఖ్యతను సీఎం రేవంత్‌రెడ్డి ఆశిస్తున్నారు. ఈ మేరకు గతంలోనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి స్వయంగా ఫోన్‌ చేసి తాను మర్యాదపూర్వకంగా కలిసేందుకు ప్రధాని మోడీ వెసులుబాటు గురించి ఆరా తీశారు. 
 
ఈ నెల 26 (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు కలిసేందుకు ప్రధాని సమయం ఇచ్చారు. కాగా, ప్రధానితో సీఎం భేటీ మర్యాదపూర్వకమేనన్న అభిప్రాయాలున్నప్పటికీ.. ఈ సందర్భంగా రేవంత్‌ రాష్ట్ర ప్రయోజనాలను మోడీ దృష్టికి తీసుకెళతారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 'ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014'లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతోపాటు ఇతర హామీలను నెరవేర్చాలని కోరనున్నారు.
 
ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో సమావేశమవుతారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు, తెలంగాణ అప్పులు, ఆస్తులు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిసారించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోక్‌సభ ఎన్నికలపై భారస కసరత్తు : మెదక్ బరిలో మాజీ సీఎం కేసీఆర్