Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో అలుముకున్న పొగమంచు-110 విమానాలు, రైళ్లు రద్దు

delhi pollution
, బుధవారం, 27 డిశెంబరు 2023 (12:58 IST)
ఢిల్లీలో పొగమంచు అలుముకుంది. మొన్నటి వరకు తీవ్ర వాయు కాలుష్యంతో అల్లాడుతున్న ఢిల్లీ ఇప్పుడు చలితో వణికిపోతోంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ఢిల్లీ వాసులు వణికిపోతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో ఢిల్లీలో తీవ్రమైన చలి గాలులు వీస్తున్నాయి. 
 
దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ రాజధాని ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. దీంతో ఉదయం కూడా లైట్లు వేసుకునేందుకు వాహనాలు వెళ్లాల్సి వస్తోంది. ఓ వైపు తీవ్రమైన చలి, మరోవైపు పొగమంచు కమ్ముకోవడంతో ఢిల్లీ ప్రజలు బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చే విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
 
ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో మంచు కారణంగా 50 మీటర్ల దూరం వాహనాలు కూడా కనిపించడం లేదు. పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
 
దాదాపు 110 దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యమైనట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఢిల్లీకి వెళ్లే పలు విమానాలను దారి మళ్లించి ఇతర నగరాల్లో ల్యాండింగ్ చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఢిల్లీకి చేరుకోవాల్సిన దాదాపు 25 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ఉత్తర రైల్వే తెలిపింది.
 
ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఉత్తర భారతదేశం అంతటా చల్లని గాలులు వీస్తున్నాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో తెల్లవారుజామున 5:15 గంటల ప్రాంతంలో పొగమంచు వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలిపే ఉపగ్రహ ఫోటోను వాతావరణ శాఖ విడుదల చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధర