Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్టాలిన్ సంగతి చూస్తానంటున్న అళగిరి.. ఆ పార్టీలో చేరుతారట...

కరుణానిధి మరణం తరువాత అన్నాదమ్ములు స్టాలిన్, అళగిరిల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. అన్నను డిఎంకే పార్టీలోనే ఉండకుండా చేయాలని పక్కా ప్రణాళికతో స్టాలిన్ పావులు కదుపుతున్నాడంటూ వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే అన్న తనపై బలనిరూపణ చేసేందుకు సిద్థమైనా సరే ఆ

స్టాలిన్ సంగతి చూస్తానంటున్న అళగిరి.. ఆ పార్టీలో చేరుతారట...
, బుధవారం, 29 ఆగస్టు 2018 (21:03 IST)
కరుణానిధి మరణం తరువాత అన్నాదమ్ములు స్టాలిన్, అళగిరిల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. అన్నను డిఎంకే పార్టీలోనే ఉండకుండా చేయాలని పక్కా ప్రణాళికతో స్టాలిన్ పావులు కదుపుతున్నాడంటూ వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే అన్న తనపై బలనిరూపణ చేసేందుకు సిద్థమైనా సరే ఆ విషయాన్ని ఎవరితో ఎక్కడా మాట్లాడలేదు. అయితే ఓక్కసారిగా డిఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో తనను అధ్యక్షుడుగా ఎన్నుకున్న తరువాత సమావేశ మందిరంలోనే అన్నపై విరుచుకుపడ్డారు. 
 
తనకు చెల్లెలు కనిమెుళి మాత్రమే ఉందని, అన్నలెవరూ లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీన్నిబట్టి అస్సలు అళగిరికి డిఎంకే పార్టీకి మధ్య ఎలాంటి సంబంధం లేదని తేల్చేశాడు. ఇది కాస్తా అళగిరికి బాగా కోపం తెప్పించింది. తమ్ముడు సంగతి చూస్తానని చెబుతున్నాడు. పార్టీని తానే ముందుండి నడిపించాలన్న ఆలోచనలో ఉన్నారు స్టాలిన్. అందుకే తమ కుటుంబ సభ్యులను పూర్తిగా పార్టీలో ఇన్వాల్వ్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు.
 
కానీ అళగిరి మాత్రం స్టాలిన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ వచ్చే నెల 5వ తేదీన బలనిరూపణకు సిద్థమవుతున్నాడు. చెన్నై నగరంలో భారీ ర్యాలీ చేసేందుకు సిద్థమయ్యాడు. అంతేకాకుండా రజినీకాంత్ పెట్టే కొత్త పార్టీలో చేరి స్టాలిన్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకొంటున్నారు. ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదమ్ముల మధ్య జరుగుతున్న రాజకీయ వైరం చర్చనీయాంశంగా మారుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై కాలవగారూ! అని నన్ను పిలిచేదెవరు?.. మంత్రి కాల్వ ఆవేదన