Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యార్థి అరాచకం.. మహిళా ప్రొఫెసర్‌ను అలా వీడియో తీశాడు..

video
, ఆదివారం, 25 జూన్ 2023 (10:58 IST)
మహారాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి అరాచకానికి తెగబడ్డాడు. తనకు పాఠాలు బోధించే మహిళా టీచర్‌ను నగ్నంగా వీడియో తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ విద్యార్థిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన మయాంక్ సింగ్ అనే విద్యార్థి యూనివర్శిటీలోని ఓ మహిళా ప్రొఫెసర్‌తో తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేసేవాడు. ఆ తర్వాత ఓ రోజున నేరుగా ఫోన్, వాట్సాప్ కాల్ చేయడం మొదలుపెట్టాడు. 
 
ఇటీవల ఓ రోజున ఆమెకు వీడియో కాల్ చేసి తాను చెప్పినట్టు చేయకపోతే తమ చాటింగ్ తాలూకు స్క్రీన్ షాట్లను యూనివర్శిటీలో బహిర్గతం చేస్తానని బెదిరించాడు. దీంతో పరువు పోతుందని భయపడిపోయిన ఆ మహిళా ప్రొఫెసర్ ఆ విద్యార్థి చెప్పినట్టు చేశాడు. విద్యార్థి సూచన మేరకు ఆ మహిళా ప్రొఫెసర్ నగ్నంగా వీడియో కాల్ చేయగా, ఆ వీడియోను అతను సేవ్ చేశాడు. ఆ తర్వాత ఆ వీడియోను బాధితురాలి భర్తకు పంపించి రూ.4 లక్షల మేరకు డిమాండ్ చేశాడు. దీంతో భార్యాభర్తలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి ఈ అరాచకానికి పాల్పడిన విద్యార్థిని అరెస్టు చేశారు. 
 
సీఎం జగన్ హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తే.. రోడ్లపై చెట్లు నరికేస్తారా : కన్నా  
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప మాఫియా గ్యాంగ్‌ ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దిగి భూకబ్జాలు చేస్తోందని, ప్రశాంతమైన విశాఖను అరాచకాలు, భూకబ్జాలకు అడ్డాగా మార్చేసిందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శనివారం రాత్రి టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సదస్సులో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రను, ముఖ్యంగా అభివృద్ధి చెందిన విశాఖను దోచుకుతినడానికే వైకాపా మూడు రాజధానుల నాటకాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. 
 
'విశాఖలో బతకలేమని సొంత పార్టీ ఎంపీలే హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ఇలాంటి అరాచక పాలన చూడలేదని వైకాపా ఎమ్మెల్యేలే చెబుతున్నారు. వంద మంది రాజారెడ్డిలు కలిస్తే ఒక జగన్మోహన్‌ రెడ్డి. గతంలో కడప లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ తరపున ఆ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా వ్యవహరించినప్పుడే ఈ విషయం నా దృష్టికి వచ్చింది. 
 
జగన్‌ 16 నెలలు జైల్లో ఉంటే, అతడి తల్లి, చెల్లి రాష్ట్రమంతా తిరిగారు. ఇప్పుడు వారు ఎక్కడున్నారో అందరికీ తెలుసు. చెల్లిని, తల్లిని నమ్మని జగన్‌ను రాష్ట్ర ప్రజలు మాత్రం ఎందుకు నమ్మాలి?' అని కన్నా ప్రశ్నించారు. 'ముఖ్యమంత్రి ధైర్యంగా ప్రజల్లోకి రావడం లేదు. ఆయన హెలికాప్టర్‌లో వస్తుంటే నేలపై వందేళ్ల నాటి చెట్లు కొట్టేస్తున్నారు. రాష్ట్ర సంపదను గంపగుత్తగా జగన్‌ వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారు. ధన, మాన, ప్రాణాల్ని కాపాడలేని ఈ ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకోవద్ద'ని ప్రజలకు పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్ హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తే.. రోడ్లపై చెట్లు నరికేస్తారా : కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్న