Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మళ్ళీ తెరపైకి హోమో సెక్సువల్ అంశం.. సుప్రీంలో పిటిషన్

హోమో సెక్సువల్‌ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎల్జీబీటీ (లెస్బియన్‌, గే, బైసెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్‌) కమ్యూనిటీ లైంగిక ప్రాధామ్యాలను పరిరక్షించేందుకు భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్‌ 377ను ర

మళ్ళీ తెరపైకి హోమో సెక్సువల్ అంశం.. సుప్రీంలో పిటిషన్
, గురువారం, 17 మే 2018 (19:49 IST)
హోమో సెక్సువల్‌ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎల్జీబీటీ (లెస్బియన్‌, గే, బైసెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్‌) కమ్యూనిటీ లైంగిక ప్రాధామ్యాలను పరిరక్షించేందుకు భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్‌ 377ను రద్దు చేయాలని కోరుతూ గురువారం ఓ పిటిషన్ దాఖలుకాగా, దీన్ని విచారణకు సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
 
ఐపీసీ సెక్షన్-377 రద్దు చేయాలని కోరుతూ 20 మంది ఐఐటీ విద్యార్థులు ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారణ చేపట్టేందుకు ధర్మాసనం అంగీకరించింది. ఐపీసీ సెక్షన్‌-377 ప్రకారం సజాతి లైంగిక కార్యకలాపాలు నేరంగా పరిగణిస్తారు. దీనిని రద్దు చేయాలని దశాబ్దాలుగా గే హక్కుల కార్యకర్తలు న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. ఈ అంశంపై గతంలో చాలా వరకు పిటిషన్లపై తీర్పు పెండింగ్‌లో ఉన్నాయి. 
 
అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఎల్జీబీటీ హక్కులను అనేక దేశాలు గుర్తిస్తూ వస్తున్నప్పుడు పౌరుల హక్కులను దెబ్బతీసే ఇలాంటి చట్టాలను ఎత్తివేయడమే మంచిదన్న ఓ అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు అసహజ శృంగారాన్ని ప్రోత్సహించే అంశం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందేమోనన్న ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. 
 
నిజానికి ఈ సెక్షన్‌ ఎత్తివేయాల్సిందిగా 2000 సంవత్సరంలోనే లా కమిషన్ సిఫార్సు చేసింది. అయినా వరుసగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీజేపీలు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. పైగా, ఎక్కడ సనాతన ధర్మాలు కలిగిన ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోందన్న భయం వాటిలో నెలకొంది. అయితే, 2009లో ఢిల్లీ హైకోర్టు సెక్షన్‌ 377ను రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. 
 
కానీ హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు 2013, డిసెంబర్‌ 11న విభేదించింది. పైగా, ఈ సెక్షన్‌ కింద శిక్ష పడేది అతి కొద్ది మందికే కనుక పౌరుల ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలిగదని సుప్రీంకోర్టు భాష్యం చెప్పింది. ఇదిలావుంటే, 1950 నుంచి ఇప్పటివరకు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌కు 30 సార్లు సవరణలు చేసినా… సెక్షన్‌ 377ను టచ్ చేయకపోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనా క్యాబ్ డ్రైవర్ ఓవరాక్షన్.. అందంగా వున్నావని పట్టపగలే?