Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అద్వానీనీ మోదీ ఎలా అవమానించారో ఈ వీడియోలో చూడండి.. రాహుల్ గాంధీ

బీజేపీ సీనియర్‌ నేత ఎల్కే అద్వానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవం ఇవ్వట్లేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మోదీ కంటే తమ పార్టీయే ఆయనను ఎక్కువ గౌరవిస్తోందని రాహుల్ గాంధీ స్పష

అద్వానీనీ మోదీ ఎలా అవమానించారో ఈ వీడియోలో చూడండి.. రాహుల్ గాంధీ
, బుధవారం, 13 జూన్ 2018 (14:39 IST)
బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీని.. ఓ బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లెక్కచేయకుండా అవమానించిన సంగతి తెలిసిందే. సీనియర్ నేత లేచి చేతులెత్తి నమస్కరించినా.. ప్రతి నమస్కారం చేయని ప్రధాని ఆయన్ని పలకరించడం కూడా చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే..
 
బీజేపీ సీనియర్‌ నేత ఎల్కే అద్వానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవం ఇవ్వట్లేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.  మోదీ కంటే తమ పార్టీయే ఆయనను ఎక్కువ గౌరవిస్తోందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాజాగా, రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. గురువు కోరిక మేరకు ఏకలవ్యుడు తన కుడి బొటన వేలిని ఇచ్చాడని, కానీ, బీజేపీ మాత్రం తమ గురువులను దూరం పెట్టిందని రాహుల్ ఎద్దేవా చేశారు. 
 
బీజేపీ సీనియర్ నేతలు అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, జస్వంత్‌ సింగ్‌ వంటి వారి కుటుంబాలను అవమాన పరచడమే భారతీయ సంస్కృతి రక్షించడమని మోదీ భావిస్తున్నారని రాహుల్‌ సెటైర్లు విసిరారు. అంతేగాకుండా రాహుల్ పోస్టు చేసిన వీడియోలో నరేంద్ర మోదీ 2018కి ముందు అద్వానీకి వంగి వంగి నమస్కరించి.. పాదాభివందనం చేసిన మోదీ.. 2018లో అద్వానీని ఏమాత్రం పట్టించుకోలేదో స్పష్టంగా చూపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్టర్ కిమ్... నా కారు చూడు... ట్రంప్ కళ్ల సైగతో...