Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చందోలు శాస్త్రిగారు పిలిస్తే... అమ్మ‌వారు బాలా త్రిపుర సుంద‌రిలా వ‌చ్చేది...చితిలో అమ్మవారి రూపం...

తాడేప‌ల్లి: 50 ఏళ్ళ క్రితం మాట. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారనే గొప్ప బాలా త్రిపుర సుందరి ఉపసాకులు. గుంటూరు జిల్లా చందోలులో నివశించేవారు. వారినే చందోలు శాస్త్రి గారని కూడా అనేవారు. తరుచూ వీరు గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు చెప్తూ ఉంటారు.

చందోలు శాస్త్రిగారు పిలిస్తే... అమ్మ‌వారు బాలా త్రిపుర సుంద‌రిలా వ‌చ్చేది...చితిలో అమ్మవారి రూపం...
, గురువారం, 6 అక్టోబరు 2016 (19:48 IST)
తాడేప‌ల్లి: 50 ఏళ్ళ క్రితం మాట. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారనే గొప్ప బాలా త్రిపుర సుందరి ఉపసాకులు. గుంటూరు జిల్లా చందోలులో నివశించేవారు. వారినే చందోలు శాస్త్రి గారని కూడా అనేవారు. తరుచూ వీరు గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు చెప్తూ ఉంటారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఒక ప్రవచనంలో చెప్పిన మాటలివి.. 'శాస్త్రి గారు ఒక కాలంలో తీవ్రమైన పేదరికం అనుభవించారు. తినడానికి తిండి లేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో కూడా వారు అమ్మవారి ఉపాసనను విడిచిపెట్టలేదు. 
 
రోజుకు 27 సార్లు లలితా సహస్రనామం పారాయణం చేసి, అమ్మవారికి నివేదన చేయడానికి ఏమీ లేకపోతే, చెంచాతో మంచినీళ్ళు నివేదన చేసేవారు. ఎంతటి తీవ్రమైన వ్యతిరేక పరిస్థితులు ఎదురుకొన్నా, అమ్మవారి యందు నిశ్చలమైన, అచంచలమైన భక్తిని వీడలేదు. ఇది చూసి అమ్మ పొంగిపోయింది.
 
ఒకానొకనాడు బాలా అమ్మవారు శాస్త్రిగారికి ప్రత్యక్షమై "శాస్త్రి! ఇంకా చాలు. ఎన్నాళ్ళు పేద‌రికం అనుభవిస్తావు. ఇక అయిపోయిందిలే" అన్నది. అక్కడితో వారి పేదరికం అంతరించింది. అటు తర్వాత వారు మరణించేవరకు వారి ఇంట అనేకమందికి అన్నదానం చేశారు. బాలా త్రిపుర సుందరి దేవిపై వారికి ఎంత భక్తి అంటే, ఆయన పనిలో ఉన్నప్పుడు, వారి ఇంటికి ఎవరైనా వచ్చి, శాస్త్రిగారిని పిలిస్తే, బాలా అమ్మవారు చిన్నపిల్ల  రూపంలో ఇంట్లోంచి బయటకు వచ్చి, 'మా నాన్న గారు పనిలో ఉన్నారండి. కాసేపు ఆగండి' అని చెప్పేది.
webdunia
 
ఆఖరికి వారి మరణం తర్వాత దేహం చితిలో కాలుతున్న సమయంలో, ఆ చితి మంటలపై అమ్మవారు కనిపించింది. ఇది ఫోటో తీసి పత్రికలలో కూడా వచ్చింది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే మాటకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. అమ్మవారిని ప్రేమతో, నిశ్చల భక్తితో, అచంచల విశ్వాసంతో పూజిస్తే, పొందలేనిదంటూ ఏం ఉంటుంది? ఓం శ్రీ మాత్రే నమః.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప‌ర‌మ శివునికి అత్యంత ప్రీతిపాత్రం... లింగాష్టకం... దాని అర్ధ స‌హితంగా ఇక్క‌డ ఇస్తున్నాం... మీకోసం(video)