Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దసరా 2023: ముగ్గురమ్మలకు అటుకులు, బెల్లం, శెనగపప్పు సమర్పిస్తే?

దసరా 2023: ముగ్గురమ్మలకు అటుకులు, బెల్లం, శెనగపప్పు సమర్పిస్తే?
, మంగళవారం, 10 అక్టోబరు 2023 (12:46 IST)
దసరాకు అంతా సిద్ధం అవుతోంది. నవరాత్రి పూజను నవదుర్గల రూపాల్లో మొదటిదైన శైలపుత్రితో ప్రారంభిస్తారు. తొమ్మిది రోజులు చేయలేనివారు ఐదురోజులు, ఐదురోజులు చేయలేనివారు మూడు రోజులు, మూడు రోజులు కూడా చేయలేనివారు కనీసం ఒక్కరోజయినా పూజ చేసినట్లయితే సంవత్సరమంతా అమ్మవారిని ఆరాధించిన ఫలం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి.
 
నవరాత్ర వ్రతం ద్వారా తనను ఆరాధించిన వారిని దుర్గాదేవి అనుగ్రహిస్తుంది. నారద పాంచరాత్ర గ్రంథంలో నవ అనే శబ్దానికి పరమేశ్వరుడని, రాత్రి శబ్దానికి పరమేశ్వరి అనీ అర్థాలు ఉన్నాయి. ఈ ప్రకారం చూస్తే పార్వతీ పరమేశ్వరుల ఆరాధనమే నవరాత్ర వ్రతం. 
 
శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ఒక ప్రత్యేకమైన విశిష్టమైన స్థానం ఉంది. చదువులతల్లి సరస్వతి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతో భక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. 
 
వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు, మొదలైన లోకోత్తర చరిత్రులకు ఈమె వాక్ వైభవాన్ని వరంగా ఇచ్చింది. త్రిశక్తి రూపాల్లో అమ్మ మూడో శక్తి రూపం, సంగీత - సాహిత్యాలకు అధిష్టాన దేవత. సకల జీవుల నాలుకపై ఈమె నివాసం ఉంటుంది. 
 
అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుద్ధి వికాసం కలుగుతుంది. నవరాత్రుల్లో ఏడో రోజైన అమ్మవారు సరస్వతి రూపంలో దర్శనమిస్తుంది. ఈమెకు నైవేద్యం పరమాన్నం, అల్లం గారెలు సమర్పిస్తారు. 
 
ఇంకా అటుకులు, బెల్లం, శెనగపప్పు, కొబ్బరిని సమర్పించవచ్చు. ఈమెకు నచ్చే రంగు బూడిద రంగు. అందుకే పూజ చేసేవారు ఈ రంగు దుస్తులను ధరించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. కోరిన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10-10-2023 మంగళవారం రాశిఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల సర్వదా శుభం...