Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు.. కథేంటి?

నవరాత్రులు ప్రతి ఏడాది అట్టహాసంగా జరుపుకుంటాం. అలాంటి నవరాత్రులను జరుపుకునేందుకు వెనకున్న కథేంటో మీకు తెలుసా? అయితే చదవండి. ''నవ'' అనే పదానికి కొత్త, తొమ్మిది అనే రెండు అర్థాలున్నాయి. శంభుడు, నిశంభుడిని సంహరించేందుకు దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు యు

నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు.. కథేంటి?
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (15:06 IST)
నవరాత్రులు ప్రతి ఏడాది అట్టహాసంగా జరుపుకుంటాం. అలాంటి నవరాత్రులను జరుపుకునేందుకు వెనకున్న కథేంటో మీకు తెలుసా? అయితే చదవండి. ''నవ'' అనే పదానికి కొత్త, తొమ్మిది అనే రెండు అర్థాలున్నాయి. శంభుడు, నిశంభుడిని సంహరించేందుకు దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి పదో రోజున ఆ రాక్షసులపై విజయం సాధించింది. అందుకే నవరాత్రుల్లో తొమ్మిది రోజులతో పాటు పదవ రోజున విజయ దశమిని జరుపుకుంటారు. విజయదశమి రోజునే రావణాసురుడిని శ్రీ రాముడు వధించాడని పురాణాలు చెప్తుంటాయి. 
 
శంభుడు, నిశంభుడు అనే రాక్షసులు బ్రహ్మదేవుని నుంచి తమకు మరణం లేని వరం కావాలని కోరుకుంటారు. అయినప్పటికీ తమకు సమమైన, ధైర్యవంతురాలైన, శక్తిమంతురాలైన మహిళ చేతిలో తమకు మరణం సంభవించాలని కోరుకుంటారు. బ్రహ్మదేవుడు ఆ వరాలను రాక్షసులకు ప్రసాదిస్తాడు. ఈ వరాల మహిమను గుర్తించని శంభు, నిశంభులకు గర్వం తలకెక్కి... దేవతలను హింసించడం మొదలెట్టారు. 
 
కానీ వారి అరాచకాలకు మట్టుబెట్టేందుకు ఆదిపరాశక్తి కౌశిక, కాళికా, కళరాత్రిగా ఉద్భవించింది. కాళికా దేవికి సహాయంగా ముగ్గురమ్మల రూపమైన అష్టమాధులు, అష్టరాత్రులుగా ఉద్భవించారు. బ్రాహ్మణి అనే బ్రహ్మశక్తి హంస వాహనంలో, కమండలంతో వైష్ణవి అనే విష్ణు శక్తి గరుడ వాహనంలో, శంఖుచక్రాలు, తామరపువ్వులు మహేశ్వరి అనే రూపంలో వృషభ వాహనంలో త్రిశూలం, వరముద్రతో, కౌమారి అనే కార్తీకేయ శక్తి వేలాయుధంతో మహేంద్ర రూపంలో ఇంద్రుని శక్తితో ఐరావతంలో వజ్రాయుధంతో వరాహిగా, చాముండేశ్వరిగా, నారసింహినిగా ఆయుధాలతో కమల పీఠంలో నవరాత్రి దేవతలు ఉద్భవించింది. ఈ దుర్గాదేవి శంభుడు, నిశంభులను సంహరించింది. దీంతో రాక్షసుల బారి నుంచి తప్పించుకున్న దేవతలు మహిషాసుర మర్దిని అయిన దేవదేవిని స్తుతించారు. అందుకే దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలాంటి వారు తమ తల లేని నీడను చూస్తారట...