Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మటన్ కాళ్ల సూప్ తాగితే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

Mutton Leg soup
, శుక్రవారం, 30 జూన్ 2023 (10:35 IST)
Mutton Leg soup
మటన్ శరీరానికి తగిన ప్రొటీన్లను ఇవ్వడమే కాదు. శరీర నిర్మాణ ప్రక్రియలో ఎంతో తోడ్పడుతుంది. మామూలుగా తినే మటన్ కంటే మటన్ సూప్ శరీరానికి ఎంతో మేలు చేస్తుందట. మటన్ సూప్ అంటే మటన్ కాళ్ల సూప్ ఆరోగ్యానికి మరింత ప్రయోజనాలు చేకూరుస్తుందట. 
 
మిరియాలు, ఉలవలు కలిపి మటన్ కాళ్ల సూప్ చేస్తే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఈ సూప్‌లో ఉండే గ్లూకోసమైనన్, కొండ్రోయిటిన్ వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 
 
మటన్ సూప్ తాగడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి ఎముకలు బలపడతాయి. మిరియాలతో మటన్ సూప్ తాగితే ఛాతీ నొప్పి, దగ్గు సమస్యలు తగ్గుతాయి. వర్షాకాలం, చలికాలంలో, మటన్ సూప్ జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది.
 
జలుబు సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుతుంది. మటన్ సూప్ పేగుల చికాకు, జీర్ణ రుగ్మతలను నయం చేస్తుంది. ప్రోటీన్లు అధికంగా ఉండే మటన్ సూప్ ఆకలిని అణచివేయడం వల్ల బరువు తగ్గడానికి గ్రేట్‌గా సహాయపడుతుంది. 
 
కానీ ఇప్పటికే బరువు తక్కువగా ఉన్నవారు తినే ముందు మటన్ సూప్ తాగకూడదు. మటన్ సూప్‌లోని ఫాస్పరస్, క్యాల్షియం దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మటన్ సూప్‌లో తీసుకుంటే  శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉదయాన్నే చద్ది అన్నం తింటే మంచిదా? కాదా?