Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చికెన్ బాల్స్ తయారీ విధానం..?

చికెన్ బాల్స్ తయారీ విధానం..?
, శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (10:57 IST)
కావలసిన పదార్థాలు:
బోన్‌లెస్ చికెన్ - 200 గ్రా
అల్లం ముక్కలు - 1 స్పూన్
సన్నగా తరిగిన ఉల్లిపాయలు - పావుకప్పు
మెంతి ఆకు - 1 స్పూన్
తరిగిన పచ్చిమిర్చి - 1 స్పూన్
కొత్తిమీర - కొద్దిగా
తరిగిన వెల్లుల్లి - 1 స్పూన్
లవంగాలు - 2
కారం - అరస్పూన్
గరమ్ మసాలా - అరస్పూన్
ఉప్పు - తగినంత.
 
తయారీ విధానం:
ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి నీరు లేకుండా మిక్సీలో వేసుకుని కైమాలా గ్రైండ్ చేసుకోవాలి. దాన్లో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా తయారుచేసి ఆవిరిపైన బాగా ఉడికించాలి. ఈ చికెన్ బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని వేడివేడిగా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతిరోజూ కొబ్బరినూనెను తాగితే.. ఏమవుతుంది..?