Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చికాగోలో నాట్స్ తెలుగమ్మాయికి విశేష స్పందన: అందం, అభినయంతో అలరించిన తెలుగు వనితలు

Telugammayi
, సోమవారం, 1 మే 2023 (23:12 IST)
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న తెలుగమ్మాయి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తాజాగా చికాగోలో నిర్వహించిన తెలుగమ్మాయి కార్యక్రమంలో వందలాది తెలుగు మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన తెలుగు సంప్రదాయాలు, సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించే వేదికగా అమెరికాలో నాట్స్ తెలుగు అమ్మాయి కార్యక్రమం రూపొందించబడింది. చికాగోలో తెలుగమ్మాయిలు తమ తెలుగుదనాన్ని ప్రదర్శించేందుకు పోటీ పడ్డారు. 350మందికి పైగా ఈ తెలుగమ్మాయి కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగమ్మాయి ముద్దుగుమ్మలు విభాగంలో విజేతగా హాసిని పోకల, తొలి రన్నరప్ ‌గా భామిని శనక్కాయల, 2వ రన్నరప్‌ గా అక్షర ఆరికట్ల నిలిచారు. కావ్య నాయకి విభాగంలో విజేతగా గీతిక మండల, తొలి రన్నరప్ ‌గా అనూష కడము,రెండవ రన్నరప్‌ గా పావని నల్లం నిలిచారు. 
 
చికాగో చాప్టర్ సహ సమన్వయకర్త బిందు వీధులమూడి, నేషనల్ కోఆర్డినేటర్ లక్ష్మి బొజ్జా, చాప్టర్ మహిళా నాయకురాలు రోజా శీలంశెట్టి, చికాగో చాప్టర్ సమన్వయకర్త హరీష్ జమ్ముల, వీర తక్కెళ్లపాటి, భారతి పుట్ట, నరేంద్ర కడియాల, కార్తీక్ మోదుకూరి,వేణు కృష్ణారెడ్డిల సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. చికాగోలాండ్‌కు చెందిన నాట్స్ ఈసీ నాయకులు మదన్ పాములపాటి, కృష్ణ నిమ్మగడ్డ, ఆర్.కె.బాలినేని తెలుగమ్మాయి విజయవంతానికి కావడానికి కావాల్సిన దిశా నిర్థేశం చేశారు. చికాగో ప్రాంతానికి చెందిన మూర్తి కొప్పాక, శ్రీను అరసాడ, శ్రీనివాస్ బొప్పన, రవి శ్రీకాకుళంలు ఈ కార్యక్రమానికి తమ పూర్తి సహకారాన్ని అందించారు.
 
webdunia
మే నెల26,27,28 తేదీల్లో న్యూజెర్సీలో జరగనున్న అమెరికా తెలుగు సంబరాలకు తెలుగువారంతా తరలిరావాలని నాట్స్ చైర్ వుమెన్ అరుణ గంటి, నాట్స్ అధ్యక్షుడు బాపయ్య (బాపు)నూతి  నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీథర్ అప్పసాని  ఆహ్వానించారు. ప్రముఖ మహిళా నాయకురాలు చాందిని దువ్వూరి, హవిలా మద్దెల, టీఏసీజీసీ గత ప్రెసిడెంట్ ప్రవీణ్ వేములపల్లి, మిసెస్ ఎన్.ఆర్.ఐ గ్లోబల్ 2022 గౌరీ శ్రీ, మిసెస్ ఇండియా ఇల్లినాయిస్- శ్వేతా చిన్నారి తెలుగమ్మాయి కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. మాధురి పాటిబండ్ల తన యాంకరింగ్‌ తో ప్రేక్షకులను కట్టిపడేశారు. చాప్టర్ వాలంటీర్లు రాజేష్ వీదులమూడి, చెన్నయ్య కంబాల, అంజయ్య వేలూరు, నరేష్ యాద, బిందు బాలినేని, కళ్యాణి మందడపు, నవీన్ జరుగుల, సుజిత్ , శ్రీనివాస్ పిల్ల తదితరులు తెలుగమ్మాయి కార్యక్రమానికి అమూల్యమైన సేవలను అందించారు. తెలుగమ్మాయి కార్యక్రమానికి ప్రత్యేకంగా విందు భోజనం ఏర్పాటు చేసిన బౌల్ ఓ బిర్యానీ,బావర్చికి నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉదయం వేళ మరీ వేడి నీటిని తాగితే ఏమవుతుంది?