Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉన్నది కాస్తా ఊడింది.. సర్వమంగళం పాడింది...

ఉన్నది కాస్తా ఊడింది.. సర్వమంగళం పాడింది...
WD
జూదం మనిషిని ఎంత వ్యసనపరుడ్ని చేస్తుందో... ఆ జూదంలో నెగ్గేందుకు ఓ వ్యక్తి ఎలాంటి పనులకు పూనుకుంటాడో... చివరికి అతని పరిస్థితి ఎలా తయారవుతుందో నాటి రచయిత కొసరాజు కళ్లకు కట్టినట్లు అందించారు. ఆ సాహిత్యానికి మాధవపెద్ది, పిఠాపురం, రాఘవులు జీవం పోశారు. నటనలో రమణారెడ్డి, రేలంగి ప్రాణంపోశారు. కులగోత్రాలు సినిమాలోని ఈ పాట...

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే
ఉన్నది కాస్తా వూడింది సర్వమంగళం పాడింది
పెళ్లాం మెళ్లో నగలతో సహా తిరుక్షవరమై పోయింది
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే

ఆ మహా మహా నలమహారాజుకే తప్పలేదు భాయి
ఓటమి తప్పలేదు భాయి
మరి నువు చెప్పలేదు భాయి
అది నా తప్పులేదు భాయి
తెలివి తక్కువగ చీట్లపేకలో దెబ్బతింటివోయి
బాబూ నిబ్బరించవోయి
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే


నిలువుదోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది
గోవింద.. గోవిందా
నిలువుదోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది
చక్కెర పొంగలి చిక్కేది
ఎలక్షన్లలలో ఖర్చు పెడితే ఎంఎల్ఏ దక్కేది
మనకు అంతటి లక్కేది
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే

గెల్పూ ఓటమీ దైవాధీనం చెయ్యి తిరగవచ్చు
మళ్లీ ఆడి గెల్వవచ్చు
ఇంకా పెట్టుబడెవడిచ్చు
ఇల్లు కుదువ చేర్చవచ్చు
ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు
పోతే.. అనుభవమ్ము వచ్చు
చివరకు జోలె కట్టవచ్చు
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే

Share this Story:

Follow Webdunia telugu