Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంజనేయుడి తోక పట్టుకున్న శనీశ్వరుడు.... ఏలినాటి శని ఏమీ చేయదా?

Hanuman
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (13:31 IST)
ఆంజనేయుడు మూల నక్షత్రంలో జన్మించాడు. ఒకసారి శని దేవుడు ఆంజనేయుడిని పట్టుకోవడానికి వచ్చాడు. ఆ సమయంలో ఆంజనేయుడు శ్రీరాముడిని పూజిస్తూ, తనను తాను మరచిపోయి కీర్తనలు పాడుతూ ఉంటాడు. బయట వేచి ఉన్న శనిదేవుడు ఆంజనేయుడి తోకను చూడగానే ఆయన తోకపై కూర్చుని గట్టిగా పట్టుకున్నాడు. శనిదేవుడిని ఎలా తరిమి కొట్టాలా అని ఆంజనేయుడు కొంత సేపు ఆలోచించాడు. ఆపై రాముడిని స్తుతిస్తూ గెంతుతూ, గెంతుతూ, ఎగురుతూ ఎగురుతూ పూజించేందుకు నిర్ణయించుకున్నాడు. 
 
దీని కారణంగా తోక చివర ఉన్న శనిదేవుడికి శరీరంలో నొప్పి వచ్చింది. శనిదేవుడు ఆంజనేయుడు దూకడం ఆపలేదు. దీంతో శనిదేవుడు ఎప్పుడు దూకడం మానేస్తావు? అని అడిగాడు. అది విన్న హనుమంతుడు.. ఏడున్నరేళ్ల పాటు దూకుతూనే ఉంటాను అన్నాడు. అంతే శనిదేవుడు భయపడ్డాడు. ఇంకా ఆంజనేయుడిని పట్టుకోవడం వల్ల మనకు ప్రయోజనం ఉండదని భావించిన శనిదేవుడు ఆయనను తక్షణమే విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. 
 
దీంతో ఆంజనేయుడు చాలా సంతోషించి శనిదేవుడిని ప్రార్థించాడు. శనీశ్వరా.. నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్లిపోవాలని భావించినందున నన్ను పూజించే నా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని అభ్యర్థించాడు. 
 
శని దేవుడు కూడా అందుకు అంగీకరించాడు. కాబట్టి ఏలినాటి శని,అష్టమ శని సమయంలో ఆంజనేయుడిని పూజిస్తే ఈతిబాధలు వుండవు. శనిదేవుని బాధల నుంచి విముక్తి పొందాలంటే..  ఆంజనేయుడిని శనివారం పూజించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గణేశ చతుర్థి రోజున వ్రతం ఆచరిస్తే.. అప్పుల బాధ మటాష్