Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ రాశిఫలాలు (01-07-17) : ఓర్పు.. ఏకాగ్రత ఉంటే విజయం మీదే...

మేషం: ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. పత్రిక, వార్తా సంస్థల్లోని ఓర్పు, ఏకాగ్రత అవసరం. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. మనుషుల మనస్తత్వమ

మీ రాశిఫలాలు (01-07-17) : ఓర్పు.. ఏకాగ్రత ఉంటే విజయం మీదే...
, శుక్రవారం, 30 జూన్ 2017 (22:04 IST)
మేషం: 
ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. పత్రిక, వార్తా సంస్థల్లోని ఓర్పు, ఏకాగ్రత అవసరం. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. మనుషుల మనస్తత్వము తెలిసి మసలుకోవడం మంచిది.
 
వృషభం 
చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహరాలకు సంబంధించి సోదరీ, సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. మిత్రుల కారణంగా మీ పనులు అర్థాంతంగా ముగించాల్సి వస్తుంది. పత్రికా ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
మిథునం 
కొబ్బరి, పండ్ల పూలు, పానీయ చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గ్రహించండి. ఆత్మీయులకు, చిన్నారులకు విలువైన కానుక లందిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
 
కర్కాటకం 
ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు. వ్యాపారాల్లో పోటీతత్వం ఆందోళన కలిగిస్తుంది. సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు విజయం సాధిస్తారు. శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
 
సింహం 
మీ సాధనలో కొన్నిసార్లు వైఫల్యం తలెత్తినా ధైర్యంతోనూ తెలివితోనూ ఎదుర్కోండి. మీ మాటలు ఇతరులకు చేరవేసే వ్యక్తులున్నారనే విషయం గమనించండి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల వ్యవహారాల్లో ఊహించని మార్పులు కానరాగలవు.
 
కన్య 
దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు బంధువర్గాలతోనూ, చుట్టుపక్కల వారితోనూ పట్టింపులేర్పడుతాయి. కాంట్రాక్టర్లకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం అనుకూలిస్తుంది. వారసత్వపు వ్యవహారాల్లో కొన్ని సమస్యలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు.
 
తుల
ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. చర్మానికి సంబంధించిన చికాకులు, కాళ్ళు, ఎముకలు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
వృశ్చికం 
శత్రువుల సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు. సోదరీ, సోదరీ వ్యవహారాల్లో ఊహించని మార్పులు కానరాగలవు. ఉద్యోగస్తులకు పనిభారం, బాధ్యతలు అధికం. క్రీడల పట్ల ఆసక్తి చూపుతారు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. ముఖ్యంగా ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.
 
ధనుస్సు 
ప్రత్తి, పొగాకు, గోధుమల వ్యాపారస్తులకు సంతృప్తి, అభివృద్ధి కానరాగలదు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులకు ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. నిరుద్యోగులు ఆలోచనలు ఉపాథి పథకాల దిశగా సాగుతాయి. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది.
 
మకరం 
మీ ప్రతిభకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు తోటివారి మాట ధోరణి ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి చికాకులు తప్పవు. ఒక ముఖ్యమైన విషయమై న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కుంభం 
ఉపాధ్యాయులకు, విద్యా సంస్థల్లో వారికి ఊహించని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఎంతో శ్రమించిన మీదటగాని అనుకున్న పనులు పూర్తి కావు. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. మిత్రుల కలయికతో గతకాలం జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి.
 
మీనం 
ఆర్థిక పరిస్థితి అనుకున్నంత సంతృప్తికరంగా ఉండదు. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. సినిమా, కళా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశీ చదువుల కోసం విద్యార్థులు చేసే యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుజగ్రహ దోషాలున్న జాతకులు.. ఇలా చేస్తే?