Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

07-02-2019 గురువారం దినఫలాలు - స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస...

07-02-2019 గురువారం దినఫలాలు - స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస...
, గురువారం, 7 ఫిబ్రవరి 2019 (08:29 IST)
మేషం: వ్యాపారాల్లో మొహమ్మాటాలకు తావివ్వడం మంచిది కాదు. ఏ విషయంలోను సర్దుకుపోవడానికి మనస్సు అంగీకరించదు. ఉద్యోగస్తుల సమర్థతకు అధికారులు గుర్తిస్తారు. ప్రముఖుల కలయిక అనుకూలించదు. కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులను ఎదుర్కుంటారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
 
వృషభం: ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యుల వైఖరి మీకెంతో అందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో అప్రమత్తతం అవసరం. ఎలక్ట్రానిక్ ఛానెళ్ల సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. సంతానం కారణంగా దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, పట్టింపులు చోటు చేసుకుంటాయి.  
 
మిధునం: ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. స్టాక్‌మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. అనుకున్న పనులు వాయిదా వేయడం మంచిది. కిట్టని వ్యక్తులు మిమ్ములను ఇరకాటానికి గురిచేసేందుకు యత్నిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన సమాచరం అందుతుంది. 
 
కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ జీవిత భాగస్వామి సలహా పాటించడం వలన మేలు జరిగే అవకాశం ఉంది. ఓర్పు, చాకచాక్యంతో చిక్కు సమస్యలను సరిచేసుకుంటారు. క్రయవిక్రయాలు ఊపందుకుంటాయి. ఎవరికీ హామీలు ఇవ్వడం మంచిది కాదు. బంధువుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు.   
 
సింహం: గృహ నిర్మాణాల్లో పెరిగిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది. సహోద్యోగుల సహకరించక పోవడంతో నిరుత్సాహం చెందుతారు. వాహనం ఇతరులకు ఇవ్వడం మంచిది కాదు. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు లైసెన్సులు మంజూరవుతాయి. విద్యార్థుల ప్రేమ వ్యవహారం పెద్దలకు సమస్యగా మారుతుంది.
 
కన్య: స్త్రీలకు పుట్టింటిపై ధ్యాస మళ్ళుతుంది. వృత్తిపరంగా ఎదుర్కుంటున్న ఆటంకాలు సమసిపోగలవు. రావలసిన బాకీలు అతికష్టంమ్మీద వసూలవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవడం మంచిది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.  
 
తుల: నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. మీ మనస్సుకు నచ్చని విషయాలను చూసీ చూడనట్టుగా వ్యవహరించవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలకు ఏ విషయంలోను మనస్థిమితం అంతగా ఉండదు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. 
 
వృశ్చికం: ఉద్యోగస్తుల పనితీరును అధికారులు ప్రశంసిస్తారు. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు, అసహనం తప్పవు. మీ అలవాట్లు, బలహీనతలు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదాపడుతాయి. మీరంటే కిట్టని వారికి మేలు చేసి వారిని మీవైపు తిప్పుకుంటారు. 
 
ధనస్సు: మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేయండి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. వ్యాపారస్తులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం, మందలింపులు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు.  
 
మకరం: ఉద్యోగస్తులకు ట్రాన్స్‌ఫర్, ప్రమోషన్ ఆర్డర్లు చేతికందుతాయి. ఆత్మీయులకు విలువైన కానుకలందిస్తారు. గత కొంత కాలంగా అనుభవిస్తున్న చికాకులు క్రమంగా తొలగిపోగలవు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. నూతన పరిచయాలేర్పడుతాయి.     
 
కుంభం: రాజకీయాలలో వారికి కార్యకర్తల వలన సమస్యలు తలెత్తుతాయి. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం. ప్రేమికులకు పెద్దల నుండి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. నూనె, మిర్చి, కంది వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి కానవస్తుంది.   
 
మీనం: ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. అకాలభోజనం, శ్రమాధిక్యత వలన పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. ఉపాధ్యాయులకు అనుకూలమైన కాలం. నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రియతముల రాక మీకెంతో సంతృప్తినిస్తుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోమరితనంతో గడిపే స్వార్థపరునికి నరకంలో కూడా...