Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంగళవారం (07-08-2018) దినఫలాలు - ఉచిత సలహా ఇచ్చి...

మేషం: ఆర్థిక, కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత అవసరం. విద్యార్థులకు తోటివారి వలన సమస్యలు తలెత్తవచ్చు. ప్రభుత్వ కార్యలయాల్లో మీ పనులు వాయిదా పడుట వలన నిరుత్స

మంగళవారం (07-08-2018) దినఫలాలు - ఉచిత సలహా ఇచ్చి...
, మంగళవారం, 7 ఆగస్టు 2018 (08:37 IST)
మేషం: ఆర్థిక, కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత అవసరం. విద్యార్థులకు తోటివారి వలన సమస్యలు తలెత్తవచ్చు. ప్రభుత్వ కార్యలయాల్లో మీ పనులు వాయిదా పడుట వలన నిరుత్సాహానికి గురౌతారు. స్త్రీలకు దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
వృషభం: సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టర్లలు అనూకూలిస్తాయి. విద్య సంస్థలలో వారికి ఉపాధ్యాయులకు అనుకూలమైన కాలం. 
 
మిధునం: ఇంజనీరింగ్, మెడికల్, శాస్త్ర రంగాలవారికి గుర్తింపు లభిస్తుంది. సోదరుల సన్నిహితులను కలుసుకుంటారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలుండవు. స్త్రీలకు బంధువర్గాల మాటతీరు ఆందోళన కలిగిస్తుంది.
 
కర్కాటకం: స్థిరాస్తి కొనుగోలు యత్నం వాయిదా పడడం మంచిది. కుటుంబీకులతో ఎక్కువ సమయం గడపండి. విజయం మీ సొంతం అని గుర్తించండి. రాజకీయనాయకులకు విదేశీ పర్యటనలు వాయిదాపడుతాయి. కాంట్రాక్టర్లకు ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం.
 
సింహం: ట్రాన్స్‌పోర్ట్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం. ఉచిత సలహా ఇచ్చి ఎదుటివారి ఉద్రేకానికి లోనుకాకండి. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. అప్పుడప్పుడు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
కన్య: ఆలయాలను సందర్శిస్తారు. ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. స్త్రీలకు షాపింగ్‌లోను, పనివారల విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. 
 
తుల: నూనె, ఎండుమిర్చి, పసుపు, ధనియాలు, బెల్లం, శెనగలు వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. దూరప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్‌లు పూర్తి అవ్వడం కష్టము. మీ తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
వృశ్చికం: దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. సినీరంగ పరిశ్రమల్లో వారికి చికాకులు, ఒత్తిడి అధికమవుతుంది. ప్రభుత్వ మూలక ఇబ్బందులు ఎదురువుతాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల వలన అప్రమత్తత అవసరం. పూర్వ మిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. స్పెక్యులేషన్ కలిసిరాగలదు.  
 
ధనస్సు: మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ఇంజనీరింగ్, మెడికల్, కంప్యూటర్, శాస్త్ర రంగాల వారికి పురోభివృద్ధి. ముఖ్యమైన పర్యటనలలో అవాంతరాలు ఎదురైనా జయం పొందుతారు. సమయాన్ని వృదా చేసే కొలది నష్టాలను ఎదుర్కుంటారు. వాహనం నిదానంగా నడపడం క్షేమదాయకం. 
 
మకరం: కొంతమంది మీ నుండి విషయాలు రాబట్టేందుకు యత్నిస్తారు. బంధువుల రాకతో సందడి కానవస్తుంది. విద్యార్థులు వాహనం నడుపునపుడు ఏకాగ్రత చాలా అవసరం. ప్రముఖులతో పరిచయాలు మరింత బలపడుతాయి. సమయానికి మిత్రుల సహకరించక పోవడంతో అసహానానికి గురవుతారు. 
 
కుంభం: ఎప్పటి నుండో వాయిదా పడుతూవస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. సామూహిక కార్యక్రమాలల పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారాలకు లాభదాయకం. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. స్త్రీలు ఆహార వ్యవహారాలలో ఏకాగ్రత వహించండి.
 
మీనం: వ్యాపారాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరీసోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మీ సంతానం విద్య, వివాహ విషయాలపట్ల శ్రద్ధ వహిస్తారు. పట్టుదలతో శ్రమిస్తే కానిపనులు నెరవేరుతాయి. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ముఖ్యం. రాజకీయాలలో వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనిషి పతానానికి కారణాలు ఏమిటో తెలుసా?