Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

20-07-2018 - శుక్రవారం మీ రాశి ఫలితాలు.. చిన్న చిన్న కలహాలు..

మేషం: బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్యల్యాలు పెంపొందుతాయి. దూరప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ప్రైవేటు సంస్థలలో వారికి తోటి వారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. ప్రింటిం

20-07-2018 - శుక్రవారం మీ రాశి ఫలితాలు.. చిన్న చిన్న కలహాలు..
, శుక్రవారం, 20 జులై 2018 (09:43 IST)
మేషం: బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్యల్యాలు పెంపొందుతాయి. దూరప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ప్రైవేటు సంస్థలలో వారికి తోటి వారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా రంగాలవారికి మిశ్రమ ఫలితం. సాహస ప్రయత్నాలు విరమించండి.
 
వృషభం: స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయనాయకులకు విదేశీపర్యటనలో మెళకువ అవసరం. ప్రయాణాలు, తీర్థయాత్రలు ఉల్లాసంగా కలిగిస్తాయి. ప్రలోభాలకు లొంగవద్దు. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆర్ధిక సంతృప్తి ఉండదు. పాత మిత్రుల సహకారం లభిస్తుంది.   
 
మిధునం: వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టసాధ్యం. కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను మెప్పించడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. దూర దేశాలువెళ్ళడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల నుండి అవమానాలు తప్పవు.
 
కర్కాటకం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఏ వ్యవహారంలోను ఇతరులపై అతిగా ఆధారపడడం మంచిది కాదు. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. 
 
సింహం: దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులు పై అధికారల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. చిన్నారులు, ప్రియితముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో మెళకువ వహించండి. బంధుమిత్రుల కలయికతో నూతన ఉత్సాహం కానవస్తుంది.
 
కన్య: ఆర్ధికంగా ఎదగడానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. విద్యార్థులకు టెక్నికల్, ఇంజనీరింగ్ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. విదేశీయానం, రుమ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు.
 
తుల: గొప్ప గొప్ప ఆలోచనలు, ఆశయాలు స్పురిస్తాయి. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రింటింగ్ రంగాలవారికి బకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.
 
వృశ్చికం: మీ యత్నాలు కొంత ఆలస్యంగానైనా పరిపూర్ణంగా పూర్తవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం.
 
ధనస్సు: వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రేమికులు అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. ప్రముఖులకు కానుకలు సమర్పించి ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటారు.
 
మకరం: స్త్రీలకు బంధువులతో అభిప్రాయ భేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి రుణాలు మంజూరు కాగలవు. ఎదుటివారి మాటలను తేలికగా తీసుకోవడం మంచిది కాదని గమనించండి. 
 
కుంభం: ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. బ్యాంకింగ్, ఫైనాన్స్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. మీ సంతానం విద్యావిషయాలు గురించి ఒక నిర్ణయానికి వస్తారు. వాగ్విదాలు, అనవసర విషాయాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. కొందరికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు. 
 
మీనం: విద్యార్థులకు టెక్నికల్, ఇంజనీరింగ్ కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు సంపాదనపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబీకులతో కలసి పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రిప్రజెంటేటి‌వ్‌లకు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేతివృత్తుల వారికి కలిసిరాగలదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రదక్షణలు వేయడం వలన ఫలితం ఏంటో?