Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాలను ప్రసాదించే కృష్ణాష్టమి

Lord Krishna
, మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (16:06 IST)
శ్రీ కృష్ణ జయంతి 2023 తేదీ సెప్టెంబర్ 6న దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. పంచాంగకర్తలు కృష్ణాష్టమిని ఆరోతేదీనే జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఈ పండుగను గోకులాష్టమి, కృష్ణాష్టమి అని కూడా అంటారు. కృష్ణ జన్మాష్టమిని ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా జరుపుకుంటారు. వైష్ణవ ఆలయాలు ఉన్న చోట, వేడుకలు ఉదయాన్నే ప్రారంభమవుతాయి. 
 
శ్రీకృష్ణుడు శ్రావణ మాసం బహుళాష్టమి అర్థరాత్రి సమయంలో జన్మించాడు. కన్నయ్య జన్మించిన సమయానికి అష్టమి తిథి ఉండటం ప్రధానమంటారు. వైష్ణవులు మాత్రం సెప్టెంబరు 7నే కృష్ణాష్టమి జరుపుకుంటారు. వారికి రోహిణి నక్షత్రంలో కూడిన అష్టమి ప్రధానం. మిగిలినవారికి కృష్ణాష్టమి సెప్టెంబరు 6 బుధవారమే.
 
ఈ రోజున ఉపవాసం ఉంటారు. ధూపం వేస్తారు, భగవద్గీత చదువుతారు. వచ్చే వారం కృష్ణ జయంతి రాబోతున్నందున, కృష్ణ జయంతిని ఎలా పూజించాలో చూద్దాం.
 
చిన్నపిల్లల నుండి పెద్దల వరకు కృష్ణ జయంతి ఆరాధన చేయాలి. కృష్ణుడిని పూజించడం వల్ల అహంకారం నశిస్తుంది. క్రూరత్వం తొలగిపోతుంది. దాంపత్య ఆటంకాలు తొలగిపోతాయి. పెళ్లికాని వారికి  వివాహం జరుగుతుంది. 
 
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని పిలుస్తారు. 
 
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణాష్టమి రోజున పూజ ఎలా చేయాలంటే..?