Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శనివారం ఇలా చేస్తే.. రాహు, కేతు దోషాలు తొలగిపోతాయి..

శనివారం పూట శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించినవారికి శని, రాహువు, కేతు గ్రహ దోషాలు తొలగిపోతాయి. శనివారం వ్రతం చేపడితే గ్రహదోషాలు మాయమవుతాయి. శనివారం శ్రీవారికి స్తుతించి వ్రతమాచరిస్తే.. నవగ్రహ దోషాలు త

శనివారం ఇలా చేస్తే.. రాహు, కేతు దోషాలు తొలగిపోతాయి..
, శనివారం, 4 ఆగస్టు 2018 (12:33 IST)
శనివారం పూట శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించినవారికి శని, రాహువు, కేతు గ్రహ దోషాలు తొలగిపోతాయి. శనివారం వ్రతం చేపడితే గ్రహదోషాలు మాయమవుతాయి. శనివారం శ్రీవారికి స్తుతించి వ్రతమాచరిస్తే.. నవగ్రహ దోషాలు తొలగిపోవడంతో పాటు శనివారం వ్రతం చేయాలి. శ్రావణమాసం లేదా పుష్యమాసంలో వచ్చే తొలి శనివారం నాడు ఈ వ్రతం ప్రారంభించి కనీసం 19 వారాలపాటు వ్రతాచరణ చేయాలి. 
 
వేంకటేశ్వర అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ చేయాలి. నవగ్రహాల అనుకూలతను కోరుకునేవారు ఆముదం, నువ్వుల నూనె, ఆవు నెయ్యి కలిపి, నలుపు, ఎరుపు, నీలిరంగు వత్తులతో దీపారాధన చేయాలి. నీలం రంగు పూలతో పూజ చేయడం శ్రేయస్కరం. ఈ పూజకు మాత్రం ఉపవాసం తప్పనిసరి. పగలు అల్పాహారం తీసుకున్నా, రాత్రి పూర్తిగా పండ్లు, పాలతో, సరిపెట్టుకోవాలి.
 
చివరి వారం ఉద్యాపనగా నలుపు రంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలం మొదలైనవి దానంగా ఇవ్వాలి. ఈ పూజ, వ్రతం భక్తిశ్రద్ధలతో కూడుకున్నదిగా వుంటుంది. హంగు, ఆర్భాటాలకు దూరంగా వుండాలి. చన్నీటి స్నానం, మితాహారం, భూశయనం, బ్రహ్మచర్యం, మద్య, మాంసాలకు, అశ్లీల సంభాషణలకు, దృశ్యాలకు దూరంగా వుండాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
అలాగే శనివారం వంకాయ‌లు, న‌ల్ల మిరియాల‌ను శ‌నివారం రోజున కొన‌కూడ‌దు. అలాగే వాడ‌కూడ‌దు. వాడితే శ‌నిగ్ర‌హంతో స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డ‌తాయ‌ని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. మినప పప్పును శ‌నివారం పూట కొన‌కూడ‌దు. తిన‌రాదు. కానీ దాన్ని ఆ రోజున వండి పేద‌ల‌కు దానమివ్వ‌వ‌చ్చు. లేదంటే కాకుల‌కు అయినా పెట్ట‌వ‌చ్చు. దీంతో శ‌ని సంతృప్తి చెందుతాడు. స‌త్ఫ‌లితాల‌ను ఇస్తాడని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శనివారం (04-08-18) దినఫలాలు - ఊహించని సంఘటనలు వల్ల...