Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆడ పిల్లల మనస్తత్వం మారిపోవడం ఎందుకో తెలుసా?

తల్లిదండ్రులంటే ఆడ పిల్లలకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. మగ పిల్లలకుంటే ఆడపిల్లలే పెళ్లయి అత్తారింటికి వెళ్లినా తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నారు. అత్తగారింటి సమస్యలను అనుకూలంగా మలచుకుని పుట్టింటికి తల్లిద

ఆడ పిల్లల మనస్తత్వం మారిపోవడం ఎందుకో తెలుసా?
, గురువారం, 21 జూన్ 2018 (12:40 IST)
తల్లిదండ్రులంటే ఆడ పిల్లలకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. మగ పిల్లలకుంటే ఆడపిల్లలే పెళ్లయి అత్తారింటికి వెళ్లినా తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నారు. అత్తగారింటి సమస్యలను అనుకూలంగా మలచుకుని పుట్టింటికి తల్లిదండ్రులకు సాయం చేయడంలో ముందుంటారు. కానీ ప్రస్తుత సామాజిక పరిస్థితుల కారణంగా ఆడ పిల్లల మనస్తత్వం మారిపోతోంది.
 
ఎందుకని ఆరాతీస్తే తల్లిదండ్రులు కష్టపడి చదివించడం కోసం నానా తంటాలు పడుతుంటే పాశ్చాత్య మోజు, చెడు స్నేహం, స్వేచ్ఛ ముసుగులో విచ్చలవిడిగా ఉండటానికి అలవాటు పడిపోతున్నారని సర్వేలో తెలుస్తుంది. ఇంకా ప్రేమ అనే పేరుతో తమ జీవితాన్ని మహిళలే అధికంగా నాశనం చేసుకుంటున్నారని సర్వే తేలిపారు.
 
ముఖ్యంగా ఆడపిల్ల మనస్తత్వం మారిపోయేందుకు కారణాలు ఏమిటని ఆరాతీస్తే తల్లిదండ్రులు ఘర్షణలకు దిగుతున్న ఆడపిల్లలు తమపై ప్రేమ చూపేందుకు వేరొకరిపై ఆధారపడుతున్నారు. తనను ప్రేమగా చూసుకునే వారి కోసం ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే బాయ్‌ఫ్రెండ్‌ ఎంచుకుంటున్నారు. తనపై ప్రేమగా చూసుకునే వ్యక్తి ఉంటాడా అనే అన్వేషణలో ప్రేమలో పడిపోతున్నారు. 
 
అయితే పెంపకంపరంగా చూస్తే మునుపంతా పాఠశాల నుంచి ఇంటికొచ్చిన తరువాత తల్లిదండ్రులతో ఆడపిల్లలు గడిపే సమయం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడంతా తల్లిదండ్రులకు ఓ గది, పిల్లలకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయడం వలన ఆడపిల్లలు చిన్న వయస్సులోనే ఒంటరితనానికి అలవాటు పడిపోతున్నారు. ఒకవేళ తల్లిదండ్రులతో సమయం వెచ్చించినా అది టీవీలు చూడటానికే సరిపోతుందని సర్వే తేల్చింది. 
 
ఈ కారణాలతో తల్లిదండ్రులతో మనస్సు విప్పి మాట్లాడే సమయం తగ్గిపోయిందని అందుకే మహిళలు బయటి వ్యక్తులతో మాటా మంతీ సాగిస్తూ వారితో సంభాషణలు స్నేహంతో మొదలై ప్రేమతో ముగస్తుందని సర్వే తేలియజేసింది. అంతేకాదు ఈ స్నేహాలు కొన్ని సుఖాంతమైతే మరికొన్ని విషాదాంతంగా మిగిలిపోతున్నాయి. అందువల్ల ప్రస్తుత సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో అధిక శ్రద్ధ తీసుకోవలసిందిగా మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేసవిలో చెమట వాసనతో బాధపడుతున్నారా... అందుకు బిల్వ ఆకులు తీసుకుంటే...