Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వర్కింగ్ ఉమెన్‌కు టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యం..!

వర్కింగ్ ఉమెన్‌కు టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యం..!
, గురువారం, 12 నవంబరు 2015 (18:23 IST)
వర్కింగ్ ఉమెన్‌కు టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యమని మానసిక నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అన్ని పనులు సక్రమంగా చక్కబెట్టుకోకపోతే సమయం వృధా పోయి చివరికి హడావుడి పడాల్సి వస్తుంది. ఏ పనికైనా టైమ్ మేనేజ్‌మెంట్ ఉండాలని ప్రతి ఒక్కరూ చెపుతారు. ముఖ్యంగా మిమ్మల్ని పక్కదారి పట్టించే అంశాలను తిరస్కరించండి. మీ ఆలోచనలు అటూ, ఇటూ తిరుగుతుంటుంటే సరిచేసుకోండి. ఓ కచ్చితమైన ప్లానింగ్ చేసుకోవడం ద్వారా మీ చుట్టపక్కల ఉన్న గందరగోళ పరిస్థితిని నివారించుకోండి. ఒక నిర్ధుష్టమైన సమయంలో మీరేం సాధించాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. 
 
ఎలాంటి ఆనందాన్ని ఇవ్వని, అర్థంపర్థం లేని అనుబంధాలను ఎప్పటికీ పూర్తికాని పనులను, చెడు అలవాట్లకు స్వస్తి చెప్పండి. ఇవి మీ సమయాన్నీ, శక్తిని వృథా చేస్తాయి. ఎప్పుడూ మీ నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ డిమాండ్ చేసే వ్యక్తులకు, ఎప్పుడూ మీ పట్ల నెగటివ్‌గా ఉండేవారికి వీలైనంత దూరంగా ఉండండి. చేయాల్సిన పనులు.. రేపు.. రేపు అంటూ వాయిదా వేయకుండా ఇవాళే చేస్తూ ఉండండి. మీకు ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా చేయాల్సిన పనుల్ని చేసేలా మీ ప్రణాళిక రూపొందించుకోండి. 
 
ఏ పని చేసినా ఆర్గనైజ్ చేసుకోండి. అది మీ డెస్క్ అయినా మీ వార్డ్రోబ్ అయినాసరే. పనికిరాని వస్తువులను నిర్దాక్షిణ్యంగా పారేసి, అంతా శుభ్రంగా ఉంచుకోండి. పనికిరానివి, పనికివచ్చేవి, వాడేవి, వాడనవి అన్నీ కలగలిపి పడేసుకోవడం వల్ల అవసరమైనవి వెతుక్కునేందుకే టైమ్ సరిపోతుంది. దీనికితోడు వస్తువు కనబడలేదని ఒత్తిడికి గురవుతారు. ఎక్కువ సమయాన్ని టీవీ, కంప్యూటర్‌ల దగ్గర గడపకపోవడమే మంచిది.

Share this Story:

Follow Webdunia telugu