Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నమామీశ్వరం సద్గురుమ్ సాయినాధమ్

సదాసత్వ్సరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుమ్ స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుమ్ సాయినాధమ్

నమామీశ్వరం సద్గురుమ్ సాయినాధమ్
, బుధవారం, 24 జనవరి 2018 (22:29 IST)
సదాసత్వ్సరూపం చిదానందకందం  
జగత్సంభవస్థాన సంహారహేతుమ్
స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుమ్ సాయినాధమ్
 
భావము : ఎల్లప్పుడూ అన్నింటికి ఆధారంగా ఏ నిజ తత్త్వమైతే ఉన్నదో ఆ నిజమే తానే అయిన వానికి, తాను తప్ప అన్యమేదిలేదు కనుక భయ, మమకారాదులు లేక, కోరికలు లేక, పూర్ణమైన తృప్తిలేక ఆనందమే తన స్వభావమే కలవానికి, చైతన్యమే తన లక్షణంగా కలవానికి, దుంప మొక్కంతటికి ఎలా మూలమో అలాగే చిదానంద గుణాలు కలిగి సృష్టికంతటికి మూలమైనవానికి, ఇట్టి ఏ మూలంలో నుండి సృష్టియనెడు మొక్క ఉద్భవించి తిరిగి అందులోనే లయించునో అట్టివానికి నామరూప వికారరహితమైన నిద్రలో నుంచి అనేక నామరూప సహితమైన మెలుకువ అనే స్థితి ఉద్భవించి తిరిగి అట్టి నిద్రలోనే లయించునట్లు సూక్ష్మములో చూసిన నిద్ర, మెలకువ, స్వప్నము అనే మూడు స్థితులకు సృష్టి, స్థితి, లయము అనే మూడు స్థితులకు ఏది ఆధారమైన తురీయము లేదా ఆత్మ అయివున్నదో అట్టి మూలస్థితి కలవానికి, తన భక్తుల కోరిక వలన లేదా ఆత్మను తెలుసుకోవలయునని తపించువారివలన మానవ రూపము ధరించి దర్శమిచ్చినట్టి వానికి సకలభూతముల యందుండి వాటినన్నింటిని నడిపించుట చేత సృష్టినంతటినీ నడుపునట్టు వానికి, సకల జగత్తునకు ఆధారమైనట్టి ఏ ఒక్క సత్యమైతే ఉన్నదో ఆ సత్యమనెడు గురురూపమున అవతరించునట్టి సకల మహాత్ములకు నాధుడైనట్టి సాయిబాబాకు నమస్కరించుచున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

45 నిమిషాల్లో తిరుమల శ్రీవారి దర్శనం.. తిరుమల గిరులు ఖాళీ...