Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ద్రౌపదిని చూసి దుర్యోధనుడు అసూయ చెందాడా? భర్తకు మందుపెట్టడంపై పాంచాలి ఏమంది?

మయసభకు వెళ్లొచ్చిన దుర్యోధనుడు, కర్ణుడు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్తారు. ఈ సందర్భంగా దుర్యోధనుడు తానెందుకు పాండవుల పట్ల అసూయ చెందాడనే విషయాన్ని చెప్తాడు. ధర్మరాజుకు మయసభలో లభించిన గౌరవం, అతనికి వచ్చిన క

ద్రౌపదిని చూసి దుర్యోధనుడు అసూయ చెందాడా? భర్తకు మందుపెట్టడంపై పాంచాలి ఏమంది?
, బుధవారం, 10 మే 2017 (15:19 IST)
మయసభకు వెళ్లొచ్చిన దుర్యోధనుడు, కర్ణుడు ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్తారు. ఈ సందర్భంగా దుర్యోధనుడు తానెందుకు పాండవుల పట్ల అసూయ చెందాడనే విషయాన్ని చెప్తాడు. ధర్మరాజుకు మయసభలో లభించిన గౌరవం, అతనికి వచ్చిన కానుకలు చూసి తాను అసూయ చెందలేదని.. పాండవులకు భార్యగా పాంచాలిని చూసే అసూయ చెందానంటాడు. అందరూ భుజించిన తర్వాత.. ద్రౌపది ఆహారం తీసుకోవడం.. పగలంతా ఐదుగురు భర్తలకు చేదోడు వాదోడుగా ఉండటం.. అందరిపై కన్నేసివుంచి.. ఎవరికి వద్ద ఎలాంటి పని చేయించాలో తెలుసుకుని.. కార్యనిర్వహణలో ఆకట్టుకుందని చెప్తాడు. 
 
అలాంటి సతీమణి ఉంటే ధర్మరాజు ఎందుకు రాణించడని చెప్తాడు. ద్రౌపది పాండవులకు లభించడంతోనే తాను అసూయ చెందానని దుర్యోధనుడు చెప్తాడు. అలా దుర్యోధనుడి వద్దే మెప్పు పొందిన పాంచాలీ.. గృహిణిగా తన ధర్మాన్ని చక్కగా పాటించింది. గృహిణిగా, సతీమణిగా ఎలా వుండాలో.. భగవానుడైన శ్రీకృష్ణుడి భార్య సత్యభామకే చెప్పింది. "పాండవుల ముఖంపై చిరునవ్వు చెదరకుండా.. వారి సంతోషానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకుంటున్న పాంచాలీని సత్యభామ ఇలా ప్రశ్నించింది. 
 
''నీ భర్తలకు ఏమైనా మందు పెట్టావా?'' అని అడుగుతుంది. అందుకు పాంచాలీ నవ్వుతూ భగవానుడి భార్యవై వుండి.. మందు పెట్టడం అనే మాట నీ నోట ఎందుకొచ్చిందని అడుగుతుంది. అందుకు సమాధానంగా పాంచాలి ఇలా చెప్తుంది. సత్యభామా.. మందు పెడితే భర్త.. ఎందుకు పనికిరాకుండా పోతాడు. మట్టిలో నానిన వానపాములా పడివుండిపోతాడు. అతనిలోని జ్ఞానేంద్రియాలు పనిచేయకుండా పోతాయని చెప్తుంది. 
 
అలాంటి భర్తకు భార్య ఎలాంటి సపర్యలు చేసినా ఫలితం ఉండదని ద్రౌపది వివరిస్తుంది. అందుకే భర్త బాగోగులు తెలుసుకుని వారి బుద్ధికి తగినట్లు.. వారికి సపర్యలు చేస్తూ.. వారు తప్పు చేస్తే ప్రశ్నించి.. సరిదిద్దే ప్రయత్నం భార్య చేయాలని హితవు చెప్తుంది. అప్పుడే భర్త మోములో చిరునవ్వు చిరకాలం వుంటుందని చెప్తుంది. భర్తకు అన్నం పెట్టే సమయంలో భార్య అమ్మ కావాలని చెప్తుంది. భర్త మోసే గృహ భారంలో పాలుపంచుకోవాలని చెప్తుంది. ఇలా కార్యనిర్వహణలో భార్య సమర్థురాలైతే.. భర్తకు తిరుగుండదని సెలవిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుద్ధుడు సంసార సుఖం నుండి విరక్తి చెందాడు... ఆచరించాల్సిన 8 బోధనలు....