Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శుక్రవారం నాడు ఇలా నోములు చేస్తే?

నోములన్నింటిలోకి శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నోము నోచుకునే వారు ఉదయాన్నే స్నానంచేసి తులసి కోట దగ్గర దీపారాధన చేసి 20 ప్రదక్షణలు చేయాలి. ఈ రోజున ఎవరింటికి గాని, ఏ ఊరికి గాన

శుక్రవారం నాడు ఇలా నోములు చేస్తే?
, గురువారం, 12 జులై 2018 (11:04 IST)
నోములన్నింటిలోకి శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నోము నోచుకునే వారు ఉదయాన్నే స్నానంచేసి తులసి కోట దగ్గర దీపారాధన చేసి 20 ప్రదక్షణలు చేయాలి. ఈ రోజున ఎవరింటికి గాని, ఏ ఊరికి గాని వెళ్లకూడదు. ప్రతి శుక్రవారం కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుంటూ 20 వారాల పాటు ఈ నోమును కొనసాగించాలి.
 
ఆ తరువాత 'లక్ష్మీ తులసి' దగ్గర 20 దీపాలు పెట్టి 20 మంది ముత్తయిదువులకు బొబ్బర్లు దానమివ్వాలి. అలాగే ఒక బ్రాహ్మణుడికి నూతన వస్త్రాలను దక్షిణ తాంబూలాలతో సహా దానమిల్వాలి. ఇక ఈ నోము నోచుకోవడానికి కారణమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పెళ్లయిన కొత్తలో ఓ యువతి పుట్టింటికి వెళ్లింది. ఆమెను తీసుకు వెళ్లడానికి వచ్చిన భర్త ఉన్న పళంగా బయలుదేరుదా మంటూ తొందర పెట్టాడు.
 
ఆ రోజున శుక్రవారం కావడం వలన అమ్మాయిని పంపించడం ఆనవాయతీ కాదంటూ అత్తామామలు అడ్డుపడ్డారు. అయినా అతను వినిపించుకోకుండా తన భార్యను తీసుకుని ఎద్దుల బండిలో వెళ్లిపోయాడు.ఈ విషయంగా ఆ దంపతులిద్దరూ బండిలో గొడవపడుతూనే ఉన్నారు. అప్పటికే బాగా పొద్దుపోవడంతో ఒక ఊళ్లో ఆగిపోయి ఓ పెద్ద మనిషి ఇంట్లో ఆశ్రయం పొందారు. 
 
వచ్చిన దగ్గర నుండి వాళ్ల ధోరణిని ఆ పెద్దమనిషి గమనిస్తూనే ఉన్నాడు. మరునాడు ఉదయం వాళ్లిద్దరూ బయలుదేరుతుండగా ఆ పెద్దమనిషి బండి దగ్గరిగి వచ్చాడు. ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానమని అందువలన వాళ్లు కంట తడి పెట్టకుండా చూసుకోవాలని ఆ యువతి భర్తతో చెప్పాడు. ఆడపిల్ల పుట్టింటిని వదిలి పెట్టేటప్పుడు సహజంగానే కన్నీళ్లు పెట్టుకుంటుందని అందువల్లనే ఆమెను శుక్రవారం తీసుకెళ్లకూడదని అన్నాడు.
 
ఈ విధంగా చేయడం ఇటు పుట్టింటి వారికి అటు అత్తింటి వారికి మంచిది కాదని చెప్పాడు. పెద్దలమాట కాదన్నందువలన కలహాలు ఏర్పడతాయని శుక్రవారం బయలుదేరడం వల్లనే వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయని చెప్పాడు.

ఇంటికి వెళ్లిన తరువాత శుక్రవారపు నోము నోచుకోమని ఫలితంగా సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అన్నాడు. అంతలో ఆయన భార్య కూడా వచ్చి ఆ నోము విధి విధానాలను గురించి చెప్పింది. దాంతో ఆ యువతి ఇటు పుట్టింటి వారి కోసం అటు అత్తింటి వారి కోసం శుక్రవారాల నోము నోచి ఉత్తమమైన ఫలితాలను పొందింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గురువారం (12-07-2018) దినఫలాలు - ఆపద సమయంలో...