Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భక్తులు సమస్యలు విన్నవిస్తే మొదటగా వినేది శ్రీవారు కాదు.. ఇంకెవరు...!

తిరుమల వెంకన్నకు ఎన్నో పేర్లున్నాయి. అసలు ఆయనకు ఉన్న పేర్లను తిరుమల తిరుపతి దేవస్థానం కూడా చెప్పలేదంటే ఆయనకు ఎన్ని పేర్లు ఉన్నాయో అర్థమవుతుంది. స్వామివారిని శ్రీనివాసుడని కూడా పిలుస్తుంటాం.

భక్తులు సమస్యలు విన్నవిస్తే మొదటగా వినేది శ్రీవారు కాదు.. ఇంకెవరు...!
, గురువారం, 4 ఆగస్టు 2016 (11:34 IST)
తిరుమల వెంకన్నకు ఎన్నో పేర్లున్నాయి. అసలు ఆయనకు ఉన్న పేర్లను తిరుమల తిరుపతి దేవస్థానం కూడా చెప్పలేదంటే ఆయనకు ఎన్ని పేర్లు ఉన్నాయో అర్థమవుతుంది. స్వామివారిని శ్రీనివాసుడని కూడా పిలుస్తుంటాం. శ్రీ అంటే దయా స్వరూపిణి, ప్రేమమయి అంటే శ్రీ మహాలక్ష్మియే. పద్మావతిని నివాసంగా కలవాడే శ్రీనివాసుడు. తిరుమల శ్రీవారి హృదయం మీద ముందుకు చొచ్చుకుని వచ్చి ఆసీనురాలయింది అలిమేలుమంగే...! 
 
అమ్మవారు స్వామివారి ఒళ్ళో ఊరికే కూర్చోలేదు. ఆ అమ్మ ముందుగా భక్తులందరి ప్రార్థనల్ని, కోరెకల్ని, కష్టాల్ని, వేదనల్ని దుఖాన్ని ముందుగా అమ్మవారే వింటారు. ఆ వెంటనే శ్రీవారికి వినిపిస్తుంది. కేవలం వినిపించడమే కాదు. ఆ స్వామివారిని ఒత్తిడి చేస్తుంది. పద్మావతిని కాదనలేక, ఆమె మాటకు కట్టుబడి ఆ శ్రీనివాస పరమాత్మ మనందరి కోరికలను తీరుస్తూ ఉన్నాడు. వరాలను గుప్పిస్తూ ఉన్నాడు. పాపాలను పోగొడుతూ ఉన్నాడు. దుఖాలను, కష్టాలను తొలగిస్తూ ఉన్నాడు. 
 
ఆపాద మస్తకం లక్ష్మీ సుసంపన్నుడైన శ్రీనివాసప్రభువు హృత్పద్మంలో భూతకారుణ్య లక్ష్మిగా అమ్మవారు దర్సనమిస్తూ ఉంటారు. మహాలక్ష్మీదేవి అనపాయినిగా శ్రీ స్వామివారితో కూడా దర్శనమిస్తూ ఉన్నందున ఆనంనిలయుడు అందరివాడై అందరి ఆశలను, సునాయాసంగా నెరవేరుస్తూ పరమార్థాల్ని ప్రసాదిస్తూ ఆనందాన్ని కలిగిస్తూ ప్రసిద్థిని పొంది ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. 
 
కాబట్టే ఈ క్షేత్రంలో కొలువై దర్సనమిస్తూ ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మూలమూర్తి ఎంతటి ప్రధానమైన దైవమో, ఆ మూర్తి హృదయంలో వేం చేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మూర్తి అంతకంటే ప్రధానమై వెలుగొందుతోంది. తద్వారా స్వామివారు స్వయంగా కలియుగ మానవులందరి కోసమే శ్రీవైకుంఠం నుండి దిగివచ్చి ఇక్కడ అర్చామూర్తిగా వెలసి కలౌవేంకట నాయక అన్న బిరుదుతో వెలసిన సాక్షాత్తు శ్రీ మన్నారాయణ మూర్తే అని తన ఉనికి ద్వారా తన ప్రకాశం ద్వారా ముల్లోకాల్లో చాటుతూ ఉన్నది. తిరుమలేశుని హృదయ పట్టపురాణి పద్మావతి దేవి.
 
అందుకే ప్రతిరోజు స్వామివారి మూలమూర్తికి తోమాలపేవ, అర్చన, నైవేధ్యాలు అయిన వెంటనే శ్రీవారి హృదయంలో వేంచేసి ఉన్న అలివేలు మంగమ్మకు కూడా ప్రత్యేకంగా తోమాలసేవ, అర్చన నైవేథ్యాలు జరుపుతుంటారు. ఇక శుక్రవారాభిషేకం సరేసరి. వక్షస్థల లక్ష్మీదేవిని ఉద్దేశించి చేయబడుతున్న శుక్రవారం నాటి అభిషేకం శ్రీ స్వామివారికి కూడా తప్పనిసరిగా జరుగుతోంది. గోవిందా....గోవిందా...! 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణా పుష్క‌రాల 12 రోజుల్లో... ఏయే రోజు ఏ దానం...?