Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఆళ్వార్ తిరుమంజన సేవ..

Tirumala
, బుధవారం, 13 సెప్టెంబరు 2023 (16:08 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆళ్వార్ తిరుమంజన సేవను నిర్వహించారు. దీని కోసం 6 గంటల పాటు భక్తులకు దర్శనం నిలిపివేయడం జరిగింది. తిరుమలలో ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఆలయాన్ని శుద్ధిచేసే ఆళ్వార్ తిరుమంజన సేవ జరిగింది. 
 
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సంవత్సరానికి నాలుగు సార్లు ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆచారం. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి వంటి పండుగలను పురస్కరించుకుని ఈ సేవను నిర్వహిస్తాం. ఈసారి బ్రహ్మోత్సవాల కోసం మంగళవారం ఆలయ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించామన్నారు. 
 
మంగళవారం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ఆలయ శుభ్రత కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు, ఆలయం మొత్తం ఈ సేవ జరిగింది. ఆళ్వార్ తిరుమంజన సేవకు అనంతరం స్వామి వారికి అభిషేక, అలంకరలు జరిగాయి. ఆపై భక్తులకు శ్రీవారి దర్శనం కలుగ జేశారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13-09-2023 బుధవారం రాశిఫలాలు - గాయిత్రి మాతను ఆరాధించిన శుభం...