Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల క్షేత్రాన్ని కాపాడిన పరాక్రమశాలి...! ఎవరు..?

తిరుమల క్షేత్రాన్ని కాపాడిన  పరాక్రమశాలి...! ఎవరు..?
, బుధవారం, 27 జులై 2016 (15:10 IST)
క్రీస్తు శకం 17వ శతాబ్దం. ఒక్కసారిగా తిరుమల క్షేత్రంపై అలజడి. ఒకవైపు తురకులు, మరోవైపు ఆంగ్లేయులు దాడికి బయలుదేరారు. క్షేత్రాన్ని కైవసం చేసుకోవడానికి పోటీలు పడ్డారు. లక్షల మంది సైన్యం. నువ్వా.. నేనా అంటూ తేల్చుకునేందుకు సిద్ధం. ఇక విషయం అలా.. అలా.. పాకింది. ఒక్క ఉదుటున పరుగులు తీశాడు పరాక్రమశాలి. ఆయనే రాజా తోడమరమల్లు. ఈయన అసలు పేరు లాలాఖేమరాము. ఈయన క్షత్రియుడు. ఆర్కాట్ నవాబైన సాదతుల్లాఖాన్‌ కొలువులో ఆయన ప్రతినిధిగా కర్ణాట ప్రాంతాన్నంతటినీ పర్యవేక్షించాడు. అసలు తిరుమల క్షేత్రాన్ని ఎలా కాపాడాడంటారా...! అది చూడండి..! 
 
తిరుమల క్షేత్రంపై ఆంగ్లేయులు, తురకుల కన్నుపడింది. క్రీస్తు శకం 17వ శతాబ్దంలోనే అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చేవారు. ఈ విషయం అటు ఆంగ్లేయులకు, ఇటు తురకులకు నచ్చేది కాదు. దీంతో ఎలాగైనా తిరుమలపై దండెత్తాలని నిర్ణయించుకున్నారు. అనుకునిందే తడువుగా యుద్ధానికి బయలుదేరారు. ఇద్దరు వేర్వేరుగా బయలుదేరారు. క్షేత్రంపై దాడికి వస్తున్నారని తెలుసుకున్న లాలాఖేమరాము వెంటనే తిరుమలకు చేరుకున్నాడు.
 
ఎలాగైనా తిరుమల క్షేత్రాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. రాజా తోడరమల్లు (లాలా ఖేమరాము) కు ముందు నుంచే శ్రీవారు అంటే ఎంతో భక్తి. ఆయన కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండేవారని పురాణాలు చెబుతున్నాయి. చివరకు ఆయన భక్తే చివరకు తిరుమల క్షేత్రాన్ని కాపాడింది. రాజా తోడరమల్లుకు ఒక ఆలోచన వచ్చింది. ఆంగ్లేయులు, తురకులకు మధ్యే గొడవ పెడితే తిరుమల క్షేత్రం ఎవరి చేతిలోకి వెళ్ళదని భావించారు. అనుకున్నదే తడువుగా తనకు తెలిసిన స్నేహితుల సహాయంతో ఎలాగోలా ఇద్దరి మధ్య గొడవ పెట్టాడు. దీంతో వారు వారు తన్నుకుని చచ్చారు.
 
వచ్చిన విషయాన్ని మరిచిపోయిన ఆంగ్లేయులు, తురకులు ప్రాణాలను చేతిలో పట్టుకుని కొంతమంది రామా గోవిందా అంటూ పరుగులు తీశారు. మరికొంతమంది ప్రాణాలే విడిచారు. మొత్తం మీద రాజతోడరమల్లు అనుకున్నది సాధించాడు. ఇలా ఒకసారి కాదు... తాను బతికున్నంత వరకు తిరుమల క్షేత్రాన్ని కాపాడుతూనే వచ్చాడు. ఇప్పటికీ రాజాతోడరమల్లు విగ్రహం శ్రీవారి ఆలయంలో ఉంది. ఆయన ఒక్క విగ్రహమే కాదు రాజాతోడరమల్లు తండ్రి మాతా మోహనదేవి, భార్య పితాబీబీల విగ్రహాలు కూడా ఉన్నాయి.
 
తిరుమల రాయమండపంలోనే వాయువ్య మూలాన నాలుగు స్థంభాల మధ్య అంటే సరిగ్గా ధ్వజస్థంభ మండపానికి సుమారు పది అడుగుల దూరంలో దక్షిణంగా శ్రీ స్వామివారికి అభిముఖంగా నమస్కరిస్తూ ఉన్నదే వీరి ముగ్గురి రాగి విగ్రహాలు. వీరి భూజాలపై తిరుమల తిరుపతి దేవస్థానం పేర్లు కూడా రాసి ఉంచింది. రాజతోడరమల్లు కుటుంబాన్ని శ్రీనివాసుడే అన్ని విధాలుగా కాపాడుతూ వచ్చేవాడని పురాణాలు చెబుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి భూలోక నందనవనంగా తిరుమల... చిరుతలు అందుకే వస్తున్నాయ్...