Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రుద్రాక్ష మహిమలు... వాటి వివరాలు...

రుద్రాక్షలు చాలా పవిత్రమైనవి. వాటిని ధరించడం ద్వారా సాత్త్విక గుణాలు పొందవచ్చును. తపస్సు చేస్తున్న శంకరుని కన్నులవెంట కారిన జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్ష చెట్లైయ్యాయని ఆధ్యాత్మిక పండితులు చ

రుద్రాక్ష మహిమలు... వాటి వివరాలు...
, శుక్రవారం, 8 జూన్ 2018 (11:55 IST)
రుద్రాక్షలు చాలా పవిత్రమైనవి. వాటిని ధరించడం ద్వారా సాత్త్విక గుణాలు పొందవచ్చును. తపస్సు చేస్తున్న శంకరుని కన్నులవెంట కారిన జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్ష చెట్లైయ్యాయని ఆధ్యాత్మిక పండితులు చెప్పుకొచ్చారు. నేపాల్ ఖట్మండు పశుపతినాథ దేవాలయంలో రుద్రాక్ష చెట్టుఉంది. అవి ఏకముఖి నుంచి దశముఖి వరుకు ఉంటాయి. అందులో ఆరు ముఖకాలకు రుద్రాక్షలు సుబ్రహ్మణ్య స్వరూపాలు ఉన్నాయని భక్తుల విశ్వాసం.
 
ఇక సృష్టిలో ఒక్క రుద్రాక్ష గింజలో మాత్రమే మధ్యలో తొర్ర ఉంటుంది. వీటిని ఒక మాలగా తయారుచేసుకోవచ్చును. రుద్రాక్షలకు అపారమైన శక్తి ఉంటుంది. రుద్రాక్షలు శరీరము మీద ఉన్నప్పుడు చెమటతడితో తడిసినప్పుడు లేదా స్నానం చేస్తున్నప్పుడు ఆ నీళ్ళు శరీరం మీద పడినా అది అవయవాల పనితీరును మెరుగుపరచుటకు సహాయపడుతుంది. 
 
అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావు. కానీ రాత్రిపూట నిద్రించేటప్పుడు రుద్రాక్షను ధరించకూడదు. రాత్రిపూట వాటిని తీసి భగవంతుని పాదాల వద్దవుంచి ఉదయాన్నే స్నాసం చేశాక వాటిని వేసుకుంటే మంచిది. రుద్రాక్షను ధరిస్తే మనం చేసే కర్మలన్నీ ఈశ్వరుని సేవలుగా మారిపోతాయి. శివునికి రుద్రాభిషేకం చేస్తే సకల సంపదలను పొందవచ్చును. కోరికలు నెరవేరేందుకు రుద్రాభిషకం చేస్తారు. అధిషేకం చేయించాలంటే తిథి ప్రకారమే చేయాలి.
 
రుద్రాక్షలతో ఏడు లేదా పదునాలుగు తిథులలో పూజలు చేయకూడదు. పండితులను సంప్రదించి వివరాలను తెలుసుకున్న తరువాతనే అభిషేకం చేయించాలి. రుద్రాక్షలు ధరించిన భక్తులు మద్యమును, మాంసమును, వెల్లుల్లిని, నీరుల్లిని, మునగకూరను, పంది మాంసాన్ని తీసుకోకూడదు. రుద్రాక్షను చూసినా, స్పృశించినా, మాలతో జపము చేసినా పాపాలన్నీ తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు చూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుక్రవారం (08-06-2018) దినఫలాలు - తాత్కాలిక అవకాశాలను సద్వినియోగం...