Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గురువారం చన్నాదాల్, నేతి వంటకాలు తినండి.. "ఓం జై జగదీష్ హరే" అనే మంత్రాన్ని?

గురువారం పూట విష్ణువును, బృహస్పతిని, గురు భగవానుడిని పూజించాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. రాఘవేంద్ర, సాయిబాబాతో పాటు గురుదేవుళ్లను పూజించాలి. గురువారం "ఓం జై జగదీష్ హరే" అనే మంత్రాన్ని నిష్ఠ

గురువారం చన్నాదాల్, నేతి వంటకాలు తినండి..
, గురువారం, 1 సెప్టెంబరు 2016 (05:22 IST)
గురువారం పూట విష్ణువును, బృహస్పతిని, గురు భగవానుడిని పూజించాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. రాఘవేంద్ర, సాయిబాబాతో పాటు గురుదేవుళ్లను పూజించాలి. గురువారం "ఓం జై జగదీష్ హరే" అనే మంత్రాన్ని నిష్ఠతో పఠించాలి. సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి.. ఇంటిల్లపాదిని శుభ్రం చేసుకుని పూజ చేసుకోవాలి. గురువారం రోజంతా విష్ణునామ స్మరణ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు తొలగిపోతాయి.
 
గురువారం పూట పసుపు రంగు దుస్తులు ధరించాలి. విష్ణువుకు, వృషస్పతివార్ అనే పిలువబడే గురువారం రోజున ఒక్కపూట భోజనం చేయడం మంచిది. పండ్లు తీసుకోవడం, అల్పాహారంతో సరిపెట్టుకోవడం ఉత్తమం. గురువారం చన్నాదాల్, నేతితో చేసిన వంటకాలు వాడటం మంచిది. పసుపు రంగుతో కూడిన వంటకాలను స్వామికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఉదాహరణకు అరటిపండ్లు వంటివి. 
 
ఇకపోతే.. ఉత్తరాదిన గురువారం పూట లక్ష్మీదేవిని, హనుమంతుడిని కూడా పూజిస్తారు. గురువారం పూట చేపట్టే ఉపవాస దీక్ష ద్వారా ఆయురారోగ్యాలు, దిగ్విజయాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. పసుపు రంగు దుస్తులను, నీలపు రత్నాన్ని ధరించాలి. గురుభగవానుడిని, వైష్ణవ ఆలయాలను దర్శించుకోవాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబరు నెల రాశి ఫలితాలు.. విఘ్నేశ్వరుని మారేడు, జమ్మి పత్రాలతో పూజిస్తే...