Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆడంబరం కోసం అప్పులు చేస్తే...? వడ్డీ రుణం తీరాలంటే?

Debits

సెల్వి

, సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (14:36 IST)
Debits
అవసరం కోసం తీసుకున్న రుణం, అనవసరంగా ఆడంబర వ్యయం కోసం తీసుకునే రుణం, న్యాయమైన పద్ధతిలో తక్కువ వడ్డీకి తీసిన రుణం, ఎక్కువ వడ్డీతో కూడా రుణాలు.. ఇలా ఏ పద్ధతిలోనైనా రుణ సమస్యను తొలగించుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.. సాధారణంగా, సంపదకు మహాలక్ష్మి పూజ ఒకటి సరిపోతుంది. 
 
సంపద పెరుగుతుంటే అప్పుల సమస్య తొలగిపోతుంది. శుభకార్యాల కోసం చేసిన అప్పుల సమస్య తీరాలంటే లక్ష్మి కుబేరపూజ చేయించుకోవాలి. ఆస్తులు చేర్చడం అంటే గృహ రుణాలు, భూములు కొనుగోలు కోసం చేసిన రుణాలు తొలగిపోవాలంటే.. అమావాస్యకు వచ్చే 14వ రోజు (భాద్రపద శుక్ల చతుర్థశి రోజు) ఆనంద వ్రతం చేస్తే తొలగిపోతుంది. 
 
అధిక వడ్డీలతో కూడిన తీవ్రమైన అప్పుల బాధలు తీరాలంటే.. శ్రీ లక్ష్మి నరసింహ పూజ చేసి రోజూ "రుణ విమోచన మంత్రం" పఠించాలి. కానీ ఆడంబరత కోసం చేసిన అప్పులకు కర్మానుసారం కష్టాలు పడాల్సిందే. 
 
అలాకాకుండా అప్పులు ఏర్పడకుండా వుండాలంటే ఆ పరిస్థితిలో తమను నెట్టవద్దంటూ భగవంతుడిని ప్రార్థించాలి. అందుకోసం శ్రీనివాసుడిని ప్రార్థించాలి. అందుకే ఉదయం సాయంత్రం పూట ఇంట దీపం వెలిగించడం అప్పుల బాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతి ఇంటికి ఒక మిథున రాశి స్త్రీ అవసరమట..