Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి తిరునామం ఆయన కనులను సగం వరకూ మూసి వుంచుతుంది... ఎందుకు?

తిరుమల వేంకటేశ్వరస్వామివారు పద్మావతి అమ్మవారి కోరిక మేరకు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చారని పురాణాలు మనకు చెబుతున్నాయి. గత జన్మలో వేదవతిగా జన్మించి, విష్ణువును వివాహమాడాలనే కోరికతో తపస్సు చేస్తున్న విష్ణువు జుట్టు పట్టుకుని పైకి లేపడానికి రావణుడు ప్ర

శ్రీవారి తిరునామం ఆయన కనులను సగం వరకూ మూసి వుంచుతుంది... ఎందుకు?
, శనివారం, 21 జులై 2018 (20:32 IST)
తిరుమల వేంకటేశ్వరస్వామివారు పద్మావతి అమ్మవారి కోరిక మేరకు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చారని పురాణాలు మనకు చెబుతున్నాయి. గత జన్మలో వేదవతిగా జన్మించి, విష్ణువును వివాహమాడాలనే కోరికతో తపస్సు చేస్తున్న విష్ణువు జుట్టు పట్టుకుని పైకి లేపడానికి రావణుడు ప్రయత్నించడంతో వెంటనే వేదవతి కళ్ళు తెరిచి తన వెంట్రుకలను అక్కడవరకు నరికి వేసింది. రావణాసురుడు చేసిన పనికి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిన వేదవతి ఎవరైనా పరస్త్రీని అంగీకారం లేకుండా తాకితే మరణిస్తారని శపించింది రావణుడ్ని. 
 
రావణుడు తాకిన తన శరీరం అపవిత్రమైందని భావించిన వేదవతి అక్కడికక్కడే ఆహుతైంది. మరొక జన్మలోనైనా విష్ణువు భర్తగా లభించాలని కోరుకుంది. తరువాత జన్మలో ఆమె ఆకాశరాజు కుమార్తెగా జన్మించి శ్రీ వేంకటేశ్వరుడిని అందరి దేవతల సమక్షంలో వివాహమాడింది. వివాహం తరువాత తిరుమలలేశుడు తనను ప్రార్థిస్తున్న కోట్లాదిమంది భక్తుల కొరకు తాను తిరుమలలో వెలసి భక్తులను ఆశీర్వదిస్తూ వారిని కలి ప్రభావం నుంచి కాపాడుతానని మాటిచ్చారు. అందుకని తిరుమల బాలాజీ విగ్రహం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. 
 
అంతేకాకుండా ఆ విగ్రహ స్వరూపం సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపంగా కూడా భావిస్తారు. ఇక అసలు విషయంలోకి వెళదాం. వెంకటేశ్వరుని విగ్రహంపై ఉన్న భారీ తిరునామం ఆయన కళ్ళను మూసి ఉంచుతుంది. గోవిందుడిని దర్శించుకునే భక్తులు ఆయన కళ్ళను సగం మాత్రమే చూడగలగుతారు. మిగిలిన సగభాగం తిరునామం కిందే ఉంటుంది. స్వామివారి విగ్రహం పాదాల నుంచి పొంగి పొరలి జలప్రవాహాన్ని విరజానదిగా పిలుస్తారు. ఇది ఎక్కడ నుంచి ప్రవహిస్తుందో ఎవరికీ అంతుచిక్కలేదు. 
 
అంతేకాకుండా అప్పుడప్పుడు స్వామివారి విగ్రహం వేడి పొగలను కక్కుతూ కనిపిస్తుందట. వేంకటేశ్వరస్వామి ఎంత శక్తివంతుడో చెప్పడానికి ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. స్వామివారి కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు ప్రసరిస్తున్నాయని తెలుసుకున్న పండితులు ఎక్కువ రోజులు స్వామివారి కళ్ళను మూసి ఉంచే విధంగా తిరునామాన్ని పెద్దగా పెడతారు. గురువారం మాత్రమే స్వామివారిని దర్శించుకునే విధంగా చిన్నగా పెడతారు. అది తిరునామం వెనుక వున్న అసలు సంగతి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూగ నోము ఎందుకు ఉంటారో తెలుసా?