Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కార్తీక మాసంలో ఆ కూరగాయలు వాడకూడదు...

కార్తీక మాసం పరమేశ్వరునికి ప్రీతికరమైనది. ఆ కార్తీక మాసంలో శివుని ఆరాధించిన వారికి ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోతాయన్నది విశ్వాసం.

కార్తీక మాసంలో ఆ కూరగాయలు వాడకూడదు...
, శుక్రవారం, 5 అక్టోబరు 2018 (12:41 IST)
కార్తీక మాసం పరమేశ్వరునికి ప్రీతికరమైనది. ఆ కార్తీక మాసంలో శివుని ఆరాధించిన వారికి ఈతిబాధలు, గ్రహదోషాలు తొలగిపోతాయన్నది విశ్వాసం. ముఖ్యంగా చాలామంది ఈ మాసంలో తులసి మాలలు ధరించి ఉసిరి చెట్టును పూజిస్తుంటారు. ఇలా చేస్తే సకలసంపదలు చేకూరుతాయని విశ్వాసం.
 
కార్తీకమాసంలో కార్తీక పురాణం 30 అధ్యాయాల్లో రోజుకు ఓ అధ్యాయం పారాయణం చేస్తే శుభదాయకమని చెప్తున్నారు. ఈశ్వరుని అశుతోషుడు అని కూడా పిలుస్తారు. భక్తులు కోరిన వరాలను తక్షణమే ప్రసాదించే భగవానుడు పరమేశ్వురుడే. కనుక శివ మంత్రాన్ని స్మరిస్తూ స్వామివారికి అలంకారాలు, నైవేద్యాలు సమర్పించి పూజలు చేయాలని పురాణాలలో చెప్పబడి వుంది. 
 
కార్తీక నియమాన్ని పాటించేవారు వీటిని తీసుకోకూడదు. అవేంటంటే.. ఇంగువ, ఉల్లి, ముల్లంగి, ఆనపకాయ, మునక్కాయ, వంకాయ, గుమ్మడి కాయ, చిక్కుడు, వెలగపండ్లు వంటి వాటిని వంటల్లో చేర్చుకోరాదు. అలానే మిగిలిన అన్నం, మాడన్నం, మినుములు, పెసలు, శెనగలు, ఉలవలు కూడా వాడకూడదు. ముఖ్యంగా కార్తీక నెలలో వచ్చే ఆదివారం నాడు, సప్తమినాడు ఉసిరికాయ, అష్టమినాడు కొబ్బరిని వాడకూడదని శాస్త్రం చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శనిగ్రహ దోషాలు తొలగిపోవాలంటే... వానరాలకు అరటి పండు ఇవ్వాలట..