Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాడిపోయిన పూలు దేవుడికి సమర్పిస్తే.. దరిద్రాన్ని ఆహ్వానించినట్టే!

ఇంట్లోని కొన్ని వస్తువులు పెట్టుకుంటే మనం ఎల్లప్పుడు సుఖసంతోషంగా ఉండొచ్చని పెద్దలు అంటుంటారు. అలాగే కొన్నివస్తువులు పెట్టుకుంటే అది అశుభమని కూడా అంటారు. అయితే ఇలాంటి విషయాలను చాలా మంది మూఢనమ్మకం అనుకు

వాడిపోయిన పూలు దేవుడికి సమర్పిస్తే.. దరిద్రాన్ని ఆహ్వానించినట్టే!
, శుక్రవారం, 15 జులై 2016 (14:17 IST)
ఇంట్లోని కొన్ని వస్తువులు పెట్టుకుంటే మనం ఎల్లప్పుడు సుఖసంతోషంగా ఉండొచ్చని పెద్దలు అంటుంటారు. అలాగే కొన్నివస్తువులు పెట్టుకుంటే అది అశుభమని కూడా అంటారు. అయితే ఇలాంటి విషయాలను చాలా మంది మూఢనమ్మకం అనుకుంటారు. సుఖసంతోషాల నిలయమైన ఇంట్లో కొన్ని వస్తువుల వల్ల ధనం కోల్పోవడం కూడా జరుగుతుందని జ్యోతిషులు చెపుతుంటారు. మన సంపద, ధనంపై దుష్ప్రభావం చూపే వస్తువులేంటి, ఏ వస్తువుల వల్ల మనకు శుభం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం..
 
కొంతమంది ఇంట్లో పాపురం గూడును పెట్టుకుంటారు. ఈ గూడు వల్ల ఇంట్లో ధనం తగ్గిపోయి. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. 
 
పగిలిన వస్తువులు ఇంటికి అశుభం. దరిద్రాన్ని చేతులారా ఆహ్వానిస్తాయి. కాబట్టి.. పగిలిపోయిన అద్ధం ఇంట్లో ఉంటే వెంటనే పారేయండి.
 
గబ్బిలాలు.. అనారోగ్యానికి, దురదృష్టకర పరిస్థితులకు, పేదరికం, మరణానికి సంకేతమని నిపుణులు సూచిస్తున్నారు. గబ్బిలాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తే.. సూర్యాస్తమయం తర్వాత తలుపులు, కిటికీలు మూసేసుకోవాలి.
 
ప్రతిరోజూ దేవుడిని పూజించేటప్పుడు విరబూసిన పూలు, తాజాపూలనే సమర్పించాలి. నిత్యం దేవుడి గదిని శుభ్రం చేసి.. వాడిపోయిన పువ్వులను తొలగించాలి. వాడిపోయిన పూలు దేవుడికి సమర్పిస్తే.. దరిద్రాన్ని ఆహ్వానించినట్టే అవుతుంది.
 
వాడిపోయిన ఆకులు ఇంటి ఆవరణలో పెంచే మొక్కల ఆకులు ఎప్పుడు తొలగిస్తూ ఉండాలి. వాడిపోయిన ఆకులను అలాగే ఉంచడం వల్ల.. నెగటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తున్నట్టు అర్థం.
 
పచ్చగా, తాజాగా ఉండే మనీ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల.. ఇంట్లోకి ధనం చేరుతుంది. 
 
వంటగది.. ఇంటికి ఆగ్నేయంలో ఉండేవిధంగా చూసుకోవాలి. వంటగదికి వేసే రంగులు పింక్ లేదా ఎల్లో కలర్లు ఉండాలి.
 
క్యాష్ లాకర్‌ని డబ్బులు పెట్టే అలమారాను దక్షిణం, నైరుతి మూలలో ఉండేలా జాగ్రత్త పడాలి. లాకర్‌లో కుబేరుడి విగ్రహం పెట్టడం వల్ల.. ఇంట్లోకి అదృష్టంతోపాటు సిరిసంపదలు వెల్లువలా వచ్చి పడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తొలి ఏకాదశి... పేలాల పిండి తినడంలో పరమార్థం ఏమిటి...?