Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్నాథ రథయాత్ర....

జగన్నాథ రథయాత్ర....
WD PhotoWD
తీర్థయాత్రలో భాగంగా ఈ వారం మీకు గుజరాత్‌లో జరిగే జగన్నాథ రథయాత్ర ఉత్సవాలను చూపించబోతున్నాం. రథయాత్ర అంటే దేవుడి విగ్రహాన్ని ఉంచిన రథాన్ని లాగే ఊరేగింపు. ఆషాఢమాసంలోని శుద్ధ ద్వైత పర్వదినాన ప్రతి సంవత్సరం రథయాత్ర ప్రారంభమవుతుంది. వేలాది మంది భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొంటారు.

ఆ రోజున, అహమ్మదాబాద్‌లోని జగన్నాథ ఆలయం నుంచి భారీ స్థాయిలో ఊరేగింపు మొదలవుతుంది. ఈ ఊరేగింపులో మూడు రథాలు పాల్గొంటాయి. మొదటిది జగన్నాథ రథం, రెండోది సుభద్రాదేవి రథం, మూడోది భలబద్రుడి రథం. నగరం లోని అన్ని వీధులగుండా ఈ యాత్ర ఊరేగింపుగా సాగుతుంది. వందలాది సాధువులు, వేలాది భక్తులు ఈ ఊరేగింపులో భక్తి పారవశ్యంతో పాల్గొంటారు. ఆ సమయంలో వాతావరణం మొత్తం భక్తి విశ్వాసాలతో నిండిపోతుంది.

అకడాలు -ప్రజలు వ్యాయామం చేసే సాంప్రదాయక వ్యాయామ శాలలు- ఈ ఊరేగింపులో అగ్రభాగాన నిలుస్తారు. ఈ అకడాలలోని సభ్యులు జగన్నాథుడిపై తమ విశ్వాసాన్ని ప్రదర్శించుకోవడానికి అద్భుతరీతిలో వ్యాయామకళను ఊరేగింపులో ప్రదర్శిస్తారు.

ఊరేగింపు సందర్భంగా నగరం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. నగరంలోని అన్ని మూలల్లోనూ జగన్నాథుడి పట్ల భక్తి పొంగి పొరలుతూ ఉంటుంది. నగర వీధుల్ల
webdunia
WD PhotoWD
రథయాత్ర సాగిపోతున్నప్పుడు ప్రజలు పూలు చల్లుతూ జగన్నాథుడికి స్వాగతం పలుకుతారు. ఆసమయంలో జగన్నాథుడిని సందర్శించడానికి ప్రతి ఒక్కరూ ఆతృత ప్రదర్శిస్తుంటారు.

ఇక్కడి సంప్రదాయం ప్రకారం జగన్నాథ ఆలయాన్ని మొదటగా గజరాజు సందర్శిస్తుంది. తర్వాత ప్రభుత్వ ఉన్నతాధిపతి - ఈ రోజుల్లో ముఖ్యమంత్రి- బంగారు పొరకతో ఆ స్థలాన్ని శుభ్రపర్చిన తర్వాత జగన్నాథుడు ఆసీనుడైన రథం పురవీధుల గుండా సాగిపోతుంది. ఉదయం ఆలయం నుంచి ప్రారంభమయ్యే రథయాత్ర కాస్సేపు విశ్రాంతి తీసుకోవడానికి సరస్‌పూర్ ప్రాంతంలో మజిలీ చేస్తుంది. విరామ సమయంలో, రథయాత్రలో పాల్గొంటున్న వారికి ఆహారం అందిస్తారు. ఆ రోజున దాదాపు లక్షమంది యాత్రికులు ఇక్కడ భోంచేస్తారని ప్రతీతి.

webdunia
WD PhotoWD
చరిత్ర: ఇక్కడి జగన్నాథ ఆలయానికి 443 సంవత్సరాల చరిత్ర ఉంది. 125 ఏళ్ల క్రితం జగన్నాథుడు ఆలయ పూజారి నరసింఘాజీ కలలో ప్రత్యక్షమై రథయాత్ర ప్రారంభించాల్సిందిగా ఆదేశించాడని చెబుతున్నారు. దైవాజ్ఞ మేరకు పూజారి రథయాత్ర నిర్వహించగా అప్పటినుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోందట. జగన్నాథుడిని సందర్శించిన భక్తులను ప్రభువు ఆశీర్వదిస్తారని, జగన్నాథ రథాన్ని లాగిన వారు తమ జీవిత రథాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు లాగినట్లేనని భక్తుల నమ్మకం.

సాంప్రదాయికంగా పడవ నడిపే జాలర్లకు మాత్రమే రథయాత్రను మొదటగా లాగే హక్కు ఉంటూ వచ్చింది. భరూచ్ ప్రాంత జాలర్లు మొట్టమొదటి రథయాత్రకు రథాన్ని అందించారని చెప్పబడుతోంది. అయితే ప్రస్తుతం రథయాత్రలో పాల్గొనే ప్రతి ఒక్కరూ రథాన్ని తామే లాగాలని దేవుడిని సేవించాలని భావిస్తుంటారు.

రథయాత్ర మరోవైపు మత సామరస్యానికి ప్రతీకగా కూడా ఉంటోంది. ఆ రోజు ఆలయ పూజారికి ముస్లింలు స్వాగతం పలుకుతారు. రథయాత్రలో తాటిముంజ, బెర్రీలను దేవుడికి సమర్పిస్తారు. కిచడి -బియ్యం, పప్పు కలిపి చేసే వంట-, గుమ్మడికాయ పాయసాన్ని దేవుడికి ప్రసాదంగా సమర్పిస్తారు.

ఎలా చేరుకోవాలి: రైలు రోడ్డు మార్గం ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి అహమ్మదాబాద్‌కు చేరుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu