Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జైనుల పవిత్ర ఉత్సవం.. పర్యూషాన్

జైనుల పవిత్ర ఉత్సవం.. పర్యూషాన్
WD PhotoWD
ఈ వారం తీర్థయాత్రలో భాగంగా.. మీకు దేశంలోని వివిధ జైన ఆలయాలను పరిచయం చేస్తున్నాం. ఈ మతం ప్రజలు పర్యూషాన్ అనే ఉత్సవాన్ని ఎంతో వేడుకగాను, ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు. సాధారణంగా జైన మతంలో రెండు తెగలు ఉన్నాయి. వీటిలో ఒకటి.. శ్వేతాంబర్. రెండోది దిగంబర్. శ్వేతాంబర్ తెగలో పర్యూషాన్ ఉత్సవాన్ని ఎనిమిది రోజుల పాటు నిర్వహిస్తారు.

ఆ తర్వాత దిగంబర్ తెగ వారు ఇదే వేడుకలను పది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ ఉత్సవానికే 'దుస్లాక్షన్' అనే పేరు కూడా ఉంది. దేశ ప్రజలు ఘనంగా జరుపుకునే ప్రధాన పండుగలైన దీపావళి, ఈద్, క్రిస్మస్ వంటి పండుగల వలె పర్యూషాన్ ఉత్సవాలు వైభవంగా జరుగక పోయినా, జైన సంప్రదాయంలో ఈ ఉత్సవాలకంటూ ప్రత్యేక స్థానం ఉంది.

జైన సంప్రదాయాలకు అద్దం పట్టే పర్యూషాన్ వేడుకలను ఈ ఏడాది ఇండోర్‌లోని అన్ని ఆలయాల్లో తిలకించవచ్చు. మహావీర్ అనుగ్రహాన్ని పొందేందుకు వేలాది మంది భక్తులు పర్యూషాన్ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవకాలంలో అలంకారప్రాయమైన ఆలయ అందాలు భక్తులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటాయి.

webdunia
WD PhotoWD
పర్యూషన్ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమేమిటంటే... వివిధ మార్గాల్లో పరిశుద్ధ ఆత్మను పొందడమే. పర్యావరణానికి ఏ మాత్రం హాని కలుగకుండా ఉండాలని పర్యూషాన్‌ను నిర్వహిస్తారని చెప్పుకొంటారు. పర్యూషాన్ ఉత్సవాల సమయంలో జైన ఆచారం మేరకు ప్రార్థనలు, మొక్కుబడులు, ఉపవాసాలు వంటివి కీలక భూమికను పోషిస్తాయి.

జైన సంప్రదాయాలు ఉట్టిపడే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆ మతస్థులు తమ దైనందిన కార్యక్రమాలకు స్వస్తి చెప్పి భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. పర్యూషాన్ పర్వ ఆఖరి రోజుల్లో క్షమావాణి పర్వ ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఈ సమయంలో గతంలో తాము తెలిసో.. తెలియకో ఇతరుల మనస్సును గాయపరిచినట్లైతే ఆ తప్పులను క్షమించాల్సిందిగా జైనులు తమ ఇష్టదైవాన్ని వేడుకుంటారు. ఇందులో క్షమించాలని కోరే భక్తుని స్థానం.. క్షమించే వారి స్థానం కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంటారు.

Share this Story:

Follow Webdunia telugu