Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాంగలి గణేష్ పంచాయతన్ ఆలయం

సాంగలి గణేష్ పంచాయతన్ ఆలయం
WD PhotoWD
సాంగలిలో వెలసిన గణేష్ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. ఈ ఆలయంలో ఉన్న గణేష్ విగ్రహం బంగారుతో తయారు చేసిందని, ఈ వినాయకుడు నిరంతరం జరి అంచుతో కూడిన వస్త్రాన్ని ధరించి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు. అలాగే సాంగలి గణేశుడుని దర్శనం చేసుకున్న మరుక్షణమే భక్తులు ఉత్సాహ భరితులై భక్తి పారవశ్వంలో తేలిపోతారని పేర్కొంటారు.

సాంగలిలో ఉన్న ఈ ఆలయం గురించి తెలియని వారుండబోరని స్థానికులు అంటుంటారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఎంతో సంతోషంగాను, శక్తి సంపదలతో తులతూగుతారనే ప్రతీక. 1844లో ఇక్కడ వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. అంతేకాదు ఇక్కడ అందమైన శివుడు, సూర్యుడు, చింతామన్షేశ్వరి, లక్ష్మినారాయణ్ జీ విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఆలయంలోని ఏకదంతుని విగ్రహానికి విలువైన ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు అలంకరించి ఉంటాయి. వినాయకుడితో పాటు ఉన్న సిద్ధి, బుద్ధి విగ్రహాలను దర్శనం
webdunia
WD PhotoWD
చేసుకుంటే భక్తి పారవశ్యం పొందుతారు. ఆలయ ప్రధాన మార్గం ఎరుపు రంగులో నిర్మితమై వుంటుంది. ఇది ఆలయానికి వచ్చే భక్తులను అమితంగా ఆకర్షిస్తుంది.

ఆలయానికి సమీపంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటుంది. వర్షాకాల సమయంలో కృష్ణానదిలో వరద రావడం, దీనివల్ల ఆ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలన్నీ వరద ముంపునకు గురికావడం ఆనవాయితీగా కనిపిస్తోంది. అందువల్ల ఆలయానికి అత్యంత రక్షణ కల్పిస్తూ నిర్మాణం సాగింది. అంటే భూమట్టానికి అత్యంత ఎత్తులో ఆలయాన్ని నిర్మించారు. శ్రీ జ్యోతిబా కొండ నుంచి తీసుకొచ్చిన బండరాళ్ళను ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు.

webdunia
WD PhotoWD
అందువల్ల ఆలయ ప్రహరీ గోడలు అత్యంత పటిష్టంగా ఉన్నాయి. ఈ ఆలయంలో ఏనుగు ఒకదాన్ని పెంచుతున్నారు. సుందర గజరాజా అనే ముద్దు పేరు కలిగిన ఈ ఏనుగు పట్ల ఇక్కడకు వచ్చే భక్తులు ప్రేమాభిమానాలు చూపుతారు. ఆలయంలో నవగ్రహ, వేదపారాయణ వంటివి రోజువారీ ప్రత్యేక పూజలుగా చేస్తుంటారు. ముఖ్యంగా ప్రతి యేడాది వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వేడుకగా జరుపుతారు.

చవితి నవరాత్రి సమయాల్లో ఇక్కడకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ ఆలయానికి వచ్చి వినాయకుడిని దర్శనం చేసుకున్నట్టయితే మన కోర్కెలు తీరుతాయనే భావన భక్తుల్లో నెలకొంది. అందువల్లే ఇక్కడకు స్థానికులే కాకుండా.. పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చి ఆది దేవుని దర్శనం చేసుకుంటారు.

ఎలా వెళ్లాలి?
బస్సు మార్గంలో.. పూణె నుంచి 235 కిలోమీటర్ల దూరంలో కొల్హాపూర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో సాంగలి గ్రామం ఉంది. ముంబై, పూణె, కొల్హాపూర్ తదితర ప్రాంతాల నుంచి డైరక్టు బస్సు సర్వీసులు ఉన్నాయి.
రైలు మార్గంలో.. సాంగలి రైల్వే స్టేషన్‌కు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి.
విమాన మార్గం.. కొల్హాపూర్ విమానాశ్రయం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం వెలసి వుంది.

Share this Story:

Follow Webdunia telugu