Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోదరభావం ఉట్టిపడే మీరాన్ దాతార్ దర్గా

సోదరభావం ఉట్టిపడే మీరాన్ దాతార్ దర్గా
WD PhotoWD
దైవ సన్నిధి (కోర్టు)లో హిందూ, క్రైస్తవ, ముస్లిం, సిక్కులు అనే తారతమ్యాలు ఉండవు. ఆయన దృష్టిలో అందరూ సమానమే. ఈ వారం తీర్థయాత్రలో ప్రముఖ భక్తి నిలయంగా పేరుగాంచిన మీరాన్ దాతార్ దర్గాను మీకు పరిచయం చేయబోతున్నాం. ఉత్తర గుజరాత్‌లో ఉన్న ఒక చిన్న గ్రామం ఉనావా. ఈ గ్రామం మెహ్‌సానా-పాలన్‌పూర్ రహదారికి సమీపంలో ఉంది. ఈ మారుమూల గ్రామానికి అత్యంత పేరు ప్రఖ్యాతలు రావడానికి ఓ ప్రత్యేకత ఉంది.

ఈ గ్రామంలో హజ్రరత్ మీరాన్ సయ్యద్ ఆలీ దాతార్ దర్గా వెలసి ఉండటమే. సుమారు ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పుణ్యస్థలం.. ఈ గ్రామం ఆవిర్భావానికి ప్రతీకగా చెపుకుంటారు. ఈ ప్రాంతానికి కేవలం ముస్లిం మతస్థుల వారు మాత్రమే కాకుండా.. వందలాది మంది హిందువులతో పాటు.. ఇతర మతస్థులు వస్తుంటారు. పేరొందిన ఈ పుణ్యస్థలంగా ఉన్న ఈ దర్గాకు దెయ్యాలు పట్టిన బాధితులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మానసిక రోగులు ఇక్కడకు
webdunia
WD PhotoWD
వస్తుంటారు. ఈ స్థలానికి చేరుకున్న మరుక్షణమే సంపూర్ణ భక్తిభావం ఉట్టిపడుతుంది.

ఈ దర్గా ప్రాశస్త్యంతో పాటు చరిత్ర కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఈ గ్రామానికి చెందిన హిందూ కవి షాహ్ షోరత్ ముస్లిం మతస్తుడైన సయ్యద్ ఆలీ‌కు మీరాన్ దాతార్ అనే పేరు పెట్టారు. మీరాన్ అంటే.. ప్రేమించేవాడు. దాతార్ అంటే సేవ చేసేవాడు. అప్పటి నుంచి సయ్యద్ ఆలీ మీరాన్ దాతార్ అనే పేరు వచ్చినట్టు చెపుతున్నారు. మీరాన్ భుక్రాన్‌ నుంచి భారత్‌కు వచ్చారు. అహ్మదాబాద్‌లోని ఖన్‌పూర్‌ నగరంలో 879 సంవత్సరంలో (ఇస్లాం క్యాలెండర్ మేరకు) 29వ తేది రంజాన్‌ నెలలో మీరాన్ జన్మించారు.

webdunia
WD PhotoWD
మీరాన్ తన చిన్న వయస్సు నుంచే అద్భుతమైన దైవీక శక్తులు కలిగి ఉండేవాడు. ఈ గ్రామంలోనే 898 సంవత్సరం 29వ తేదీన సైఫర్ నెలలో మీరాన్ అస్తమించారు. అప్పటి నుంచి ఆయన సమాధి వెలసిన ప్రాంతాన్ని పుణ్య స్థలంగా భావించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి వందలాది మంది భక్తులు ఇక్కడకు తరలి వస్తుంటారు. అనారోగ్య సమస్యలతో పాటు మానసిక రోగులుగా ఉండే బాధితులు తమ వ్యాధుల నుంచి విముక్తి పొందేందుకు గాను ఇక్కడకు వస్తుంటారు.

ఈ దర్గా పరిరక్షణలో నిమగ్నమై వున్న సయ్యద్ సేఠ్ మిరాన్ మాట్లాడుతూ ఈ పుణ్యస్థలం గురించి తెలుసుకున్న గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మంగళవారం ఇక్కడకు మానసిక రోగులను పంపుతోంది. వారితో ఇక్కడకు వచ్చే రోగులకు చికిత్స చేయిస్తోంది. ఈ చికిత్స కోసం రోగుల నుంచి ఎలాంటి రుసుంను వారు
webdunia
WD PhotoWD
వసూలు చేయడం లేదని వివరించారు. ఇలా ప్రసిద్ధిగాంచిన మీరాన్ దర్గా ఎందరో రోగులకు ప్రశాంతను చేకూర్చుతోంది.

ఎలా చేరుకోవాలి..?
ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న విమానాశ్రయం అహ్మదాబాద్. ఇక్కడకు విమానంలో చేరుకుని అక్కడ నుంచి టాక్సీ లేదా కారు ద్వారా వెళ్లవచ్చు. ఈ పుణ్యస్థలానికి ఉంజా, మెహ్‌సానా‌ రైల్వే స్టేషన్‌లు ఐదు, 19 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఢిల్లీ-పాలన్‌పూర్‌-అహ్మదాబాద్‌ జాతీయ రహదారిలో ఉనావా ప్రాంతం ఉంది. ఇది పాలన్‌పూర్‌కు 55 కిలోమీటర్లు, అహ్మదాబాద్‌కు 95 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది.

Share this Story:

Follow Webdunia telugu