Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటిగ్రేటెడ్ ఇ-లైబ్రరీ యాప్ ట్రాన్సెండ్‌తో ఆధ్యాత్మికతను విప్లవాత్మకంగా మారుస్తున్న ఇస్కాన్

image
, సోమవారం, 28 ఆగస్టు 2023 (23:13 IST)
మానసిక వికాసానికి, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం  పుస్తకాలు ఒక అనివార్య మాధ్యమం. ఇస్కాన్ యొక్క పబ్లిషింగ్ విభాగం భక్తివేదాంత బుక్ ట్రస్ట్ ఈ రోజు వారి వినూత్న యాప్ “ట్రాన్సెండ్” (Transcend)ని విడుదల చేసింది, ఇది ప్రపంచంలోనే ఆడియో మరియు ఇ-బుక్స్ రెండింటినీ ఒకే చోట అందించే మొట్ట మొదటి ఇ-లైబ్రరీ యాప్.
 
ఆడియోబుక్‌ల అభిమాని అయినా లేదా ఈ-బుక్స్ ( eBooks) చదవడానికి ఇష్టపడినా, ట్రాన్సెండ్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. వినియోగదారులు కేవలం కొన్ని ట్యాప్‌లతో ఆడియో మరియు ఈ-బుక్ ఫార్మాట్‌ల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా మారవచ్చు, తద్వారా తమ అవసరాలకు సరిగ్గా  సరిపోయే విధంగా తమకు ఇష్టమైన పుస్తకాలనూ ఆస్వాదించే అవకాశమూ అందిస్తుంది. శ్రీల ప్రభుపాద పుస్తకాలలోని 2.7 లక్షల పేజీలకు పైగా విస్తరించి ఉన్న మొత్తం 5.6 కోట్ల పదాలు 8000+ గంటల ఆడియో మరియు 600+ ఇ-బుక్స్‌లుగా మార్చబడ్డాయి.
 
ఈ యాప్ ఆండ్రాయిడ్  మరియు iOS ప్లాట్‌ఫారమ్‌లలో, వెబ్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంది. వివరణాత్మక సమాచారం, డెమో ట్యుటోరియల్‌లు పూర్తి  ఆలోచనాత్మకంగా transcendstore.comలో అందించబడ్డాయి. ఈ- యాప్ ఒకసారి కొనుగోలుతో జీవితకాల యాక్సెస్‌‌ను మరియు 600+ ఇ-పుస్తకాలను ఉచితంగా అందిస్తుంది. అత్యంత శక్తివంతమైన భద్రతా కార్యాచరణతో ఈ యాప్ అభివృద్ధి చేయబడింది మరియు వినియోగదారులకు సౌకర్యవంతమైన ఇంటర్‌ఫేస్‌ను ఇది అందిస్తుంది. ఫ్లాష్‌కార్డ్‌లు, సులభంగా షేర్ చేసుకునే అవకాశం మరియు ఈ -బుక్‌ల కోసం మాత్రమే కాకుండా యాప్ డిజైన్‌లో విలీనం చేయబడిన ఆడియో బుక్ నేరేషన్‌  బుక్‌మార్క్ ఎంపిక యొక్క గుర్తించదగిన ఫీచర్ సహా అనేక సంచలనాత్మక ఫీచర్లు ఉన్నాయి.
 
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ యాప్ వెనుక వున్న తమ లక్ష్యాలను భక్తివేదాంత బుక్ ట్రస్ట్, ట్రస్టీ మరియు సీఓఓ, శ్రీ ఆనంద తీర్థదాసు పంచుకుంటూ "ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న లేదా స్వీయ-ఆవిష్కరణ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించాలనుకునే ఆధ్యాత్మిక అన్వేషకులందరి కోసం ట్రాన్సెండ్ యాప్ రూపొందించబడింది. నేడు ప్రజలు రోజువారీ రాకపోకలు మరియు ఇంటి ప్రాపంచిక పనులలో చాలా గంటలు గడుపుతున్నారు. ఈ యాప్ ప్రజలు తమ ప్రయాణాన్ని మరియు రోజువారీ పనుల సమయాన్ని దైవంతో కనెక్ట్ అయ్యే అవకాశంగా మార్చుకోవడంలో సహాయపడుతుంది.  త్వరలోనే వివిధ విదేశీ భాషలు కూడా జోడించబడతాయి..." అని అన్నారు. 
 
ఆడియోబుక్ మరియు కంటెంట్ ప్రస్తుతం 11 భాషలలో అందుబాటులో ఉన్నాయి. రాబోయే నెలల్లో మరిన్ని ప్రాంతీయ భాషలు జోడించబడతాయి. బ్లాక్‌చెయిన్స్ మైనింగ్ మరియు క్రిప్టో ఔత్సాహికులను సైతం ఈ ప్లాట్‌ఫారమ్ నిర్మిస్తున్నప్పుడు పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఇది లేయర్ 2 లెవల్  పాలిగాన్  బ్లాక్‌చెయిన్‌ను ఉపయోగించటం ద్వారా క్రిప్టో వినియోగదారులు సైతం BBT పుస్తకాలను మరియు పెయింటింగ్‌లు కొనుగోలు చేయగలరనే భరోసా అందిస్తుంది. వారికి నూతన తరపు సాంకేతికతతో నడిచే ప్లాట్‌ఫారమ్‌ను అందజేస్తాయని నిర్ధారించటం వల్ల ట్రాన్సెండ్‌తో మాత్రమే కాదు వారు తమ లోపల ఉన్న దైవంతో కూడా కనెక్ట్ అవ్వగలరు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాస్తు టిప్స్.. సూర్యోదయం నిద్ర వద్దు.. వంటగదిలో ఖాళీ బకెట్‌ వుంచితే?