Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గౌరీగుట్టపై శ్రీ గౌతమేశ్వరుడు... ఆలయ విశిష్టతలు ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో గుత్తి గ్రామములో వెలసిన స్వయంభువు శ్రీ గౌతమేశ్వరస్వామిగా ప్రసిద్ధి. గుత్తి రైల్వేస్టేషన్‌కు ఈశాన్య భాగాన ఒక పవిత్రమైన కొండగుట్ట కలదు. చుట్టూ పచ్చని పొలాలు, పచ్చని చెట్ల మధ్య ఒకే గుట్టపై ఒకే ప్రాంగణంలో ఎనిమిది దేవాల

గౌరీగుట్టపై శ్రీ గౌతమేశ్వరుడు... ఆలయ విశిష్టతలు ఏమిటి?
, సోమవారం, 24 సెప్టెంబరు 2018 (13:41 IST)
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో గుత్తి గ్రామములో వెలసిన స్వయంభువు శ్రీ గౌతమేశ్వరస్వామిగా ప్రసిద్ధి. గుత్తి రైల్వేస్టేషన్‌కు ఈశాన్య భాగాన ఒక పవిత్రమైన కొండగుట్ట కలదు. చుట్టూ పచ్చని పొలాలు, పచ్చని చెట్ల మధ్య ఒకే గుట్టపై ఒకే ప్రాంగణంలో ఎనిమిది దేవాలయములతో చూసేందుకు దివ్యక్షేత్రంలా కనిపించే ఆ పవిత్రగుట్టకు గౌరీగుట్ట అని పేరు. 
 
ఈ గుట్టలోని ఒక బిలములో శివుడు స్వయంభువుగా ఉద్భవించిన లింగము వుంది. శ్రీ గౌతమ మహర్షుల తపస్సుకు మెచ్చి శివుడు స్వయంగా అవతరించిన లింగరూపుడు కనుక ఈ లింగానికి గౌతమేశ్వర లింగం అని పేరు. శ్రీ గౌతమేశ్వరుడుగా వెలసిన ఈ గౌతమేశ్వర లింగము తొలుత మనుషులకు కనిపించేది కాదు. కాలక్రమేణా పెరుగుతూ నేటికి ఒక అడుగు ఎత్తు పెరిగింది. శ్రీ గౌతమేశ్వర లింగమునకు వెనుక గోడవలే వుండే రాతిబండకు క్రింది భాగమున చిన్న రంధ్రము ఉంది. 
 
ఈ రంధ్రము ద్వారా, నీటి చెమ్మ వచ్చి శ్రీ గౌతమేశ్వర లింగమునకు తాకుతూ వుంటుంది. ఇక్కడికి రామదాసు అనే సాధువు వచ్చి కొండ బిలములలో నివశిస్తూ భక్తుల సహకారంతో ఎనిమిది ఆలయాలను నిర్మించి స్వర్గస్తులయ్యారి. ఈ బిలములో వున్న సొరంగ మార్గము నుండి నేటికీ ఒక పెద్ద పాము వచ్చి స్వామి వారిని సేవించి పోతూ వుండటం అద్భుతం. శ్రీ రామదాసు భక్తుల సహకారంతో గౌతమేశ్వరుడున్న బిలములోనే అభయ ముద్రతో పార్వతీ దేవి అతి సుందర విగ్రహమును ప్రతిష్టించారు. గౌతమేశ్వరుడున్న బిలమునకు కొద్దిదూరములో కుడివైపున ఇద్దరు పతులతో శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి  ఆలయము, మహాగణపతి ఆలయము, కాళింగ మర్ధనుడి ఆలయము, శ్రీ గౌతమేశ్వరుడి బిలమునకు ఎడమ ప్రక్కగా బిలము నందు శ్రీ వీరభధ్రస్వామి విగ్రహము, శ్రీ భూదేవి ముఖరూపు విగ్రహము ప్రతిష్టంచియున్నారు.
 
శ్రీ గౌతమేశ్వరుని ఎదురుగా శ్రీ ఆంజనేయస్వామి దేవాలయము, నవగ్రహముల ఆలయము ప్రతిష్టంచియున్నారు. ఈ ఆలయములు అన్నీ ఒకే గుట్టపై ఉన్నాయి. ఈ ఆలయము అన్నింటికి కలిపి ఒకే ప్రహరీగోడ నిర్మించారు. ఈ గుట్ట క్రింది భాగాన శ్రీ షిరిడి బాబా వారి ఆలయము కట్టించియున్నారు. శ్రీ రామదాసుగారి మరణానంతరము స్ధానికులు వీరిని ఇచ్చటనే సమాధి చేశారు. కార్తీక మాసములో స్వామి వారికి భక్తాదులచే అభిషేకము, సోమవారము సామూహిక రుద్రాభిషేకము జరుపుచున్నారు. జ్వాలాతోరణ మహాత్సవము నాడు భక్తులతో దేవాలయము కిటకిటలాడుతుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ బయోపిక్‌లో హ‌రికృష్ణ క్యారెక్ట‌ర్ గురించి లేటెస్ట్ న్యూస్..!