Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విఫలమైన ప్రేమలే హిట్... ఎందుకని?

విఫలమైన ప్రేమలే హిట్... ఎందుకని?
, శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (16:12 IST)
విఫలమైన ప్రేమ మాత్రమే చరిత్ర అవుతుంది అంటారు. అలాగే విఫలమైన ప్రేమ మధురమైన జ్ఞాపకమని అందుకే విఫలమైన ప్రేమలన్నీ మధుర జ్ఞాపకాలేనని కొందరు చెబుతుంటారు. ఈ వాక్యం నిజమనిపించేలా ఏ చరిత్ర చూసినా విఫలమైన ప్రేమలు మాత్రమే కనిపిస్తాయి.  
 
ప్రేమ అన్న రెండక్షరాలు చరిత్రను సృష్టించగలదు. అలాగే చరిత్రను తిరగరాయనూగలదు. అందుకే ప్రపంచంలో దేనీకి లొంగనిదిగా ప్రేమను అభివర్ణిస్తుంటారు. ప్రేమ గొప్పదని అందరూ ఒప్పుకుంటుంటారు. కానీ అదేమీ దురదృష్టమో గానీ ప్రేమ అన్న విషయం తమ పిల్లల దాకా వస్తే మాత్రం అంతవరకు పొగిడిన వారి తల్లిదండ్రులు సైతం ప్రేమపై అంతెత్తున లేచి పడుతారు. ఆ ప్రేమికులను విడదీయడానికి వీలైన అన్ని ప్రయత్నాలు ప్రారంభిస్తారు. 
 
ప్రేమికులుగా మీరేమీ సాధించలేరని ప్రేమ ఆకర్షణ మాత్రమేనని అందుకే తమ మాట విని ప్రేమ గీమా అంటూ నాశనం కావద్దని గీతోపదేశం ప్రారంభిస్తారు. అలా కాదని వారి పిల్లలు ప్రేమ విషయంలో ముందుకెళితే దానిని నాశనం చేయడానికి క్రూరమైన ప్రయత్నాలు సైతం ప్రారంభిస్తారు. 
 
అయితే ప్రేమ గురించి అంతలా భయపడే పెద్దలు కేవలం తమ పెద్దరికాన్ని నిరూపించుకోవడానికి తప్ప మరే విధంగానూ పిల్లల ప్రేమను విడదీయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని మర్చిపోతుంటారు. ఇదంతా ఓ పక్కమాత్రమే.. కొన్నిసార్లు ప్రేమ విషయంలో ప్రేమికుల తప్పులు సైతం వారి ప్రేమ విఫలం కావడానికి దారితీస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పుడప్పుడు ఆఫీసుకు లీవ్ పెట్టేస్తున్నారా?