Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాటల్లో ఉన్నంత మాధుర్యం మరేదానిలోను లేదు!

మాటల్లో ఉన్నంత మాధుర్యం మరేదానిలోను లేదు!
, గురువారం, 24 మార్చి 2016 (09:12 IST)
స్నేహంలో అయినా, ప్రేమలో అయినా, సంసారంలో అయినా పునాది మాటలతోనే నిర్మాణమవుతుంది. ప్రేమికులలో ఒకరికొకరు ఆకర్షించబడటంలో అందం పాత్ర తక్కువే. ఇందులో ముఖ్య పాత్రను పోషించేది మాత్రం మాటలే. అందాన్ని చూసి ప్రేమలో పడే వారు ఎక్కువ శాతం వున్నప్పటికి, నిజమైన ప్రేమలో పడే వారు బహు తక్కువ. కొన్ని ప్రేమ జంటలను చూసినప్పుడు వారిది ప్రేమ వివాహమంటే నమ్మడం కష్టమే. అందుకే నా కళ్ళతో చూడు అంటారు ప్రేమికులు. ఆ కళ్ళతో కనిపించే రూపం, చెవులకు వినిపించే మాటల ముందు అర్థంలేనిదవుతుంది. 
 
ఆరంభంలో 'హలో... హలో' అంటూ ఏర్పడిన పరిచయమే ఏ ప్రేమ జంటదైనా. తొలిచూపులోనే ప్రేమించామని చెప్పుకునేవారిది కూడా. ఆ తర్వాతి మాటల్లోనే బలమైన ప్రేమ అవుతుంది. మిగిలిన అన్ని అంశాలు బాగున్నప్పటికి, ప్రేమబంధం బలపడడానికి కారణం వారి మాటలే. నిజానికి మాటలకున్నశక్తి ఇతరవాటికి ఉండదు. 
 
మాటలకు సమ్మోహన శక్తివుంటుంది. కొందరు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది. చెవుల్లో తేనే పోసినట్టుంటుంది. ప్రేమికుల మాటలు అలా సాగేవే. ఒక అంశంలో నుండి మరో అంశంలోకి అలవోకగా మారిపోతూ కాలానికి అతితీతంగా కబుర్లాడుకునే జంటలను చూస్తుంటే మాటలకు ఇంత శక్తి వుందా అని ఆశ్చర్యం కలుగుతుంది. ప్రేమికులు మనసు విప్పివారు చెప్పుకునే కబుర్లు వారిని మానసికంగా బాగా దగ్గర చేస్తాయి. ఒకరి మాటలు మరొకరిని ఎంతగానో ప్రభావితం చేసి, అవతలి వారి కోసం తమ జీవనాన్ని మార్చుకునేందుకు చేసేవే మాటలు. 

Share this Story:

Follow Webdunia telugu