Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమను ఇంతకన్నా గొప్పగా వర్ణించడం సాధ్యం కాదేమో.. (Video)

ప్రేమను ఇంతకన్నా గొప్పగా వర్ణించడం సాధ్యం కాదేమో.. (Video)
, గురువారం, 14 ఫిబ్రవరి 2019 (15:50 IST)
ప్రేమను వ్యక్తపరచడంలో ఒక్కో ప్రేమికుడు ఒక్కో శైలిని అవలంబిస్తుంటారు. కొంత మంది గిఫ్ట్‌లు ఇస్తారు, మరికొంత మంది తమ ప్రేయసి లేదా ప్రేమికుడికి ఇష్టమైన వస్తువులను కొనిస్తుంటారు. తమలోని భావాలను తెలియజేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. తెలుగు సినిమాల్లో అయితే హీరోలు పాటలు పాడి మరీ ప్రేయసికి తమ ప్రేమను తెలియజేస్తారు. 
 
ప్రేమ అనేది ఒక అద్భుత భావన. సినీ గీతాల్లో ఎన్నో అద్భుతమైన ప్రేమ పాటలు వచ్చాయి. ఓ ప్రేమికుడు తన మనస్సులోని భావాలను పాట రూపంలో తెలియజేయడాన్ని లవ్‌టుడే చిత్రంలో చూడవచ్చు. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించాడు. ప్రేమను తన ప్రేయసికి ఇంతకన్నా గొప్పగా ఎవరూ తెలియజేయలేరేమో.. అదే 'వాకింగ్ ఇన్ ద మూన్ లైట్' అనే పాట. 
 
ఆ పాట పల్లవిలో వచ్చే 'ఒంటరి వేళలోన ఐ యామ్ థింకింగ్ ఆఫ్ యూ, అందరి మధ్య ఉన్న ఐ యామ్ థింకింగ్ ఆఫ్ యూ అంటూ' వచ్చే లిరిక్స్ ప్రేమికుల మధ్య ఉండే ఆ భావోద్వేగాలను తెలియజేస్తుంది. మరోపక్క చరణంలో ప్రేమను గురించి రచయిత మరింత గొప్పగా చెప్పాడు. 
 
'యవ్వన వనమున పువ్వు నువ్వే పువ్వులు మెచ్చిన పూజ నువ్వే పూజకు వచ్చిన దైవం నువ్వే, మెత్తగా గిల్లిన ముల్లు నువ్వే మనసున కలిగిన బాధ నువ్వే బాధను మించిన భాగ్యం నువ్వే, ప్రతి ఋతువులో గొంతు కొమ్మల కోయిల నువ్వేలే, ప్రతి సంధ్యలో గుండె గడపలో ప్రమిదవు నువ్వేలే, నువ్వంటె ఎవరో కాదు ప్రేమేలే' అంటూ ప్రేమను గురించి అత్యద్భుతంగా వ్రాసారు. ఎన్ని ఇబ్బందులు కలిగిన, ఎలాంటి పరిస్థితులు ఏర్పడిన చివరకు అది ప్రేమేనంటూ ప్రేమికుడు ఫీలవుతుంటాడు. ఈ ప్రేమ గీతాన్ని మీరు కూడా ఓ సారి చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాధ మనకి బలవంతులు ఎలా అవ్వాలో నేర్పుతుంది..?