Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంక్రాంతి పండుగ సమయంలో ఆంధ్ర-తెలంగాణ రుచుల ఆస్వాదన చేయండి

Arisalu, Sankranti

ఐవీఆర్

, శుక్రవారం, 12 జనవరి 2024 (18:59 IST)
ప్రతి సంవత్సరం, జనవరి మధ్యలో, రంగులు, రుచులు ఆహ్లాదకరమైన వాతావరణంతో తెలంగాణ కోలాహలంగా మారిపోతుంది. శీతాకాలం ముగిసి, పంట కాలం ప్రారంభం కావటానికి సూచికగా జరిగే నాలుగు రోజుల సంక్రాంతి పండుగ, కుటుంబం, స్నేహితులతో కొత్త పంట యొక్క ఆనందాన్ని పంచుకునే సమయంగా నిలుస్తుంది.
 
గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ, “కొత్త సంవత్సరంలో కొన్ని రోజులు గడిచి పోయాయి. సంక్రాంతి పండుగ- ప్రక్షాళన, పునరుద్ధరణను సూచిస్తుంది. ఆలయ సందర్శనలు, రంగురంగుల రంగోలిలు, వివిధ రకాల వంటకాలు ఇప్పుడు మరింత వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. భారతదేశం లోని విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా తెలంగాణగా ఉంది. నేను కుటుంబం, స్నేహితులతో కలిసి టెర్రస్ పైనుండి గాలిపటాలు ఎగురవేయడాన్ని ఆస్వాదించాను. ఆకాశం రంగులు, సృజనాత్మకత యొక్క కాన్వాస్‌గా మారుతుంది. పండుగ యొక్క నిజమైన రుచి ఖచ్చితంగా తెలంగాణలో గోల్డ్ డ్రాప్‌లో తయారుచేసిన వంటకాలతో వస్తుంది" అని అన్నారు. 
 
భారతదేశం అంతటా సంక్రాంతిని పొంగల్, లోహ్రీ, ఉత్తరాయణ్ అని విభిన్న రకాలుగా చేసుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అనే నాలుగు రోజుల సంక్రాంతి పండుగ భోజన ప్రియులకు పండగే. 
 
ఈ పండుగ వేళ ప్రయత్నించడానికి అనువైన తెలుగు వంటకాల రుచులివిగో... 
పొంగల్: పాలు, బెల్లం, నెయ్యితో వండిన అన్నం- పప్పు వంటకం. ఇది వెన్న, ఒకవైపు చట్నీతో వేడిగా వడ్డిస్తారు.
పొంగల్‌లో రెండు రకాలు ఉన్నాయి: తీపి పొంగల్(చక్కర పొంగల్), రుచికరమైన పొంగల్ (వెన్న్ పొంగల్)
సకినాలు: బియ్యప్పిండి, నువ్వులు, ఉప్పుతో చేసిన క్రిస్పీ- కరకరలాడే చిరుతిండి. ఇది నూనెలో వేయించి, చక్రాల ఆకారంలో ఉంటుంది. ఇది తెలంగాణ ప్రత్యేకత, పండుగ సమయంలో పెద్ద మొత్తంలో తయారుచేస్తారు.
అరిసెలు: బియ్యపు పిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపి, మృదువైన వంటకం. ఇది డిస్క్‌లో చదును చేసి నూనెలో వేయించాలి. తర్వాత నువ్వుల పూత పూసి వేడిగా లేదా చల్లగా వడ్డిస్తారు.
కొబ్బరి కజ్జికాయలు: ఈ తీపి పేస్టరీలు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత, తురిమిన కొబ్బరి, పంచదారతో నింపబడి, బంగారు రంగు వచ్చేవరకు వరకు వేయించి తింటారు.
చెక్కలు: సంప్రదాయ వేయించిన స్నాక్స్. కరకరలాడుతూ, రుచికరంగా వుంటూ ఎంత తిన్నా తినాలనిపిస్తాయి. అవి బియ్యం పిండి, సెనగ పప్పు, కరివేపాకు, పచ్చి మిరపకాయలు, ఇంగువ వంటి మసాలా దినుసులతో తయారుచేస్తారు. తెలుగు వంటకాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవడం రుచి, ఆకృతి, సంప్రదాయానికి సంబంధించినది. సంక్రాంతి, పొంగల్, లోహ్రీ, ఉత్తరాయణ శుభాకాంక్షలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

12-01-2024 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవికి పూజ చేయడంవల్ల అన్నివిధాలా శుభం..